Begin typing your search above and press return to search.

కొత్తింట్లోకి సామ్.. ఎక్కడుంటున్నారు మేడమ్?

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త అప్డేట్లు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   4 Oct 2025 1:34 PM IST
కొత్తింట్లోకి సామ్.. ఎక్కడుంటున్నారు మేడమ్?
X

స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త అప్డేట్లు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. తరచూ రకరకాల పోస్టులు పెడుతుంటారు. అందులో భాగంగా దసరా ఫెస్టివల్ సందర్భంగా అభిమానులకు ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. కొత్త ప్రయాణం అంటూ సామ్ కొత్తింటి పిక్ ను షేర్ చేశారు.

ఇంటి ద్వారానికి చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసినట్లు కనిపిస్తుంది. అదే సమయంలో ఇంటి గోడపై ఆమె నిక్‌ నేమ్‌ SAM (సామ్‌) లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఆ ఇల్లు కేవలం సమంతకు మాత్రమే సొంతం అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇల్లు హైదరాబాద్ లోనా.. ముంబయిలోనా అనేది తెలియదు.

అందుకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే సామ్.. కొంతకాలంగా ముంబయిలోనే కనిపిస్తున్నారు. బాంద్రాలోని ఓ జిమ్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో సమంత.. ఇప్పుడు పోస్ట్ ఇల్లు.. ముంబయిలోనేది అయింటుందని అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో కొత్త ప్రయాణం అంటూ సామ్ క్యాప్షన్ ఇవ్వగా.. నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు న్యూ బిగినింగ్స్ అంటూ పోస్టులు పెట్టగా.. అందులో డైరెక్టర్ రాజ్ నిడిమోరు పిక్స్ ఉన్నాయి. కొంతకాలంగా వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

దానిపై ఇప్పటి వరకు అటు సమంత గానీ.. ఇటు రాజ్ నిడిమోరు గానీ స్పందించలేదు. నెట్టింట వస్తున్న వారల్లో నిజమెంతో.. అబద్ధమెంతో చెప్పడం లేదు. కానీ ఎప్పటికప్పుడు కలిసి మాత్రం కనిపిస్తున్నారు. తరచూ వెకేషన్స్ కు వెళ్తున్నారు. దీంతో ఓ రేంజ్ లో వార్తలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సైలెంట్ గా ఉంటున్నారు.

ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. మయోసైటిస్ వల్ల కాస్త బ్రేక్ తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ యాక్టివ్ గా ఉంటున్నారు. సిటడెల్‌: హనీ బన్నీ వెబ్‌సిరీస్‌ తో గతేడాది సందడి చేసిన సమంత.. ఇటీవల శుభంలో గెస్ట్ రోల్ లో మెప్పించారు. ఆ సినిమాను ఆమెనే నిర్మించారు. ప్రస్తుతం రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌ డమ్‌ ప్రాజెక్టులో యాక్ట్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం మా ఇంటి బంగారం సినిమాను అనౌన్స్ చేశారు.