మా ఇంటి బంగారం టీజర్.. మాటల్లేవ్ అంతే..!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం.
By: Ramesh Boddu | 9 Jan 2026 10:34 AM ISTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. తను మొదలు పెట్టిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లోనే ఈ సినిమా వస్తుంది. మా ఇంటి బంగారం సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు సపోర్ట్ చేస్తున్నారు. నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. ఇక ఈ టీజర్ చూస్తే ఒక పెద్ద ఇంటికి కోడలిగా వచ్చిన అమ్మాయి ఓ పక్క చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. మరోపక్క విలన్లను మడతపెట్టేస్తుంది.
రెండు వేరియేషన్స్ ఉన్న రోల్ లో సమంత..
ఈ రెండు వేరియేషన్స్ ఉన్న రోల్ లో సమంత అదరగొట్టేసింది. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ 2లో ఆమె చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా మా ఇంటి బంగారం సినిమాలో కూడా సమంత యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది. సమంత బస్సులో ఫైట్ సీన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. మొత్తానికి మా ఇంటి బంగారం సినిమా టైటిల్ విచిత్రంగా ఉంది సినిమా కథ ఎలా ఉంటుంది అనుకున్న ఆడియన్స్ కి టీజర్ తో సర్ ప్రైజ్ చేశారు.
నందిని రెడ్డి, సమంత క్లోజ్ ఫ్రెండ్స్.. ఐతే కొన్నాళ్లుగా నందిని రెడ్డికి సరైన బ్రేక్ రావట్లేదు. అందుకే సమంతతో కలిసి మా ఇంటి బంగారం సినిమాతో సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. మా ఇంటి బంగారం టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. సమంత మరోసారి తన సత్తా చాటేలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడిమోరు వెనుక సపోర్ట్ గా ఉండటం మరింత స్త్రెంగ్త్ అవుతుంది. మొత్తానికి సమంత కంబ్యాక్ ఒక రేంజ్ లో ఉండేలా ఉందని ఈ టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది.
కంటెంట్ బాగుంటే చాలు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా..
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత మొదటి సినిమాగా శుభం చేసింది ఐతే ఆ సినిమాలో సమంత ఒక రోల్ చేసింది. ఐతే ఈసారి మా ఇంటి బంగారం సినిమాలో తనే లీడ్ రోల్ లో నటిస్తుంది. కంటెంట్ బాగుంటే చాలు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయని ఇంతకుముందు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మా ఇంటి బంగారం టీజర్ లోనే కథ హింట్ ఇచ్చారు కాబట్టి మరి సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
సమంత ఎప్పుడు కొత్త సినిమాతో వచ్చినా ఆమె ఎంచుకునే కథలు.. చేసే పాత్రలు సర్ ప్రైజ్ చేస్తాయి. నటిగా ఇప్పటికే ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సమంత ఈసారి మా ఇంటి బంగారం తో తనలోని యాక్షన్ మోడ్ ని కూడా చూపించి ప్రేక్షకుల చేత సూపర్ అనిపించుకోవాలని చూస్తుంది.
