Begin typing your search above and press return to search.

రాజ్ తో మొదలైన సామ్ కొత్త జర్నీ.. వీడియో వైరల్

ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరగడానికి మరో ముఖ్య కారణం డైరెక్టర్. సమంతకు 'ఓ బేబీ' లాంటి మరచిపోలేని బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

By:  M Prashanth   |   27 Oct 2025 8:20 PM IST
రాజ్ తో మొదలైన సామ్ కొత్త జర్నీ.. వీడియో వైరల్
X

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ షూటింగ్‌లతో బిజీగా మారిపోయారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్, తన ఫ్యాన్స్‌ను చాలా కాలంగా వెయిట్ చేయించారు. మధ్యలో 'శుభం' లాంటి సినిమాల్లో కనిపించినా, ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్‌లో ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ వెయిటింగ్‌కు తెరపడింది. సమంత అఫీషియల్‌గా తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.

ఇటీవల దసరా శుభ సందర్భంగా అక్టోబర్ 2న ఈ కొత్త ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు సామ్ అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'మా ఇంటి బంగారం' అనే క్లాస్, ఫ్యామిలీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. లాంచ్ వీడియోలో, ఫోటోలలో సమంత రెడ్ డ్రెస్‌లో చాలా అందంగా, ఎంతో సంతోషంగా కనిపించారు. అంతే కాకుండా ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమొరు కూడా ఆ పూజ కార్యక్రమాలలో సమంతతో కలిసి పాల్గొన్నారు. అతనే మొదటి క్లాప్ కొట్టడం విశేషం.

అయితే, ఈ సినిమాకు ఉన్న అతిపెద్ద స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో సమంత కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ఆమే ప్రొడ్యూసర్ కూడా. తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై సమంత నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ఒకవైపు నటిగా ఉంటూనే, మరోవైపు నిర్మాతగా కూడా మారి, తన అభిరుచికి తగ్గ కథలను ఎంచుకోవడంలో సామ్ ఫుల్ ఫోకస్‌తో ఉన్నారని ఇది చూపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరగడానికి మరో ముఖ్య కారణం డైరెక్టర్. సమంతకు 'ఓ బేబీ' లాంటి మరచిపోలేని బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఇది మరో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ అవుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.

ఈ సినిమాకు క్రియేటివ్ సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సమంతకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన 'ది ఫ్యామిలీ మ్యాన్' క్రియేటర్స్ రాజ్ డీకే (రాజ్ నిడిమోరు, డీకే) కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం పంచుకుంటున్నారు. వాళ్ల క్రియేటివ్ విజన్ కూడా తోడవడంతో సినిమా రేంజ్ మారిపోయింది. మొత్తానికి, చాలా గ్యాప్ తర్వాత సమంత మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. అది కూడా తన సొంత బ్యానర్‌లో, నందిని రెడ్డి లాంటి హిట్ డైరెక్టర్‌తో, 'మా ఇంటి బంగారం' లాంటి పాజిటివ్ టైటిల్‌తో రావడం ఆమె ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇస్తోంది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.