Begin typing your search above and press return to search.

సమంత ఈజ్ బ్యాక్.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్!

అయితే తాజాగా హీరోయిన్ సమంత చాలా రోజులకి తన కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. తెలుగులో ఖుషి మూవీ తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్ పాత్రలో సమంత కనిపించలేదు.

By:  Madhu Reddy   |   24 Oct 2025 3:00 AM IST
సమంత ఈజ్ బ్యాక్.. ఘనంగా ప్రారంభమైన షూటింగ్!
X

ఒకప్పుడు స్టార్ పొజిషన్ లో ఉన్న చాలామంది నటీమణులు కాలం మారుతున్న కొద్దీ ఇండస్ట్రీలకు కొత్త కొత్త నటీమణులు రావడంతో సీనియర్ లకి అవకాశాలు తగ్గిపోయి ఫేడౌట్ అయిపోతూ ఉంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది సీనియర్ నటీమణులకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయినప్పటికీ కీ రోల్స్, ఐటెం సాంగ్స్, స్పెషల్ పాత్రల్లో చేస్తూ సినిమాల్లో రాణిస్తున్నారు. కొంతమంది నటీమణులు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చేస్తున్నారు. అయితే తాజాగా హీరోయిన్ సమంత చాలా రోజులకి తన కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. తెలుగులో ఖుషి మూవీ తర్వాత మళ్లీ ఫుల్ లెంగ్త్ పాత్రలో సమంత కనిపించలేదు.

ఈ ఏడాది సమంత నిర్మాతగా చేసిన శుభం మూవీలో కనిపించినప్పటికీ అది కేవలం అతిథి పాత్ర వరకే పరిమితమైంది. ప్రస్తుతం సమంతని ఫుల్ లెంగ్త్ పాత్రలో చూడడం కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో సమంతకు సంబంధించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే సమంత కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ నిన్నటి నుండి ప్రారంభమైందట. సమంత ప్రస్తుతం తన సొంత బ్యానర్ అయినటువంటి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో 'మా ఇంటి బంగారం' అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు పట్టాలెక్కడం లేదు. అయితే రీసెంట్ గానే సమంత అక్టోబర్ లో తన కొత్త మూవీ అయినటువంటి మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పింది.

చెప్పినట్లుగానే మా ఇంటి బంగారం సినిమా షూటింగ్ నిన్నటి నుండి స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో నిన్నటి నుండి ప్రారంభమైంది.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీకి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తోంది.అయితే ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుండి స్టార్ట్ అవ్వడంతో ఈ సినిమాకి సంబంధించిన మిగతా అప్డేట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.. అలా కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సమంత మొత్తానికైతే కం బ్యాక్ ఇచ్చేసిందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా తాజాగా మరో విషయంతో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది సమంత..అదే దీపావళి సెలబ్రేషన్స్ ని తన రూమార్డ్ బాయ్ ఫ్రెండ్ గా పేరున్నటువంటి రాజ్ నిడిమోరు తో కలిసి చేసుకోవడమే.. కొద్ది రోజుల నుండి సమంత ఎక్కడికి వెళ్ళినా సరే రాజ్ నిడిమోరు తోనే కలిసి వెళుతుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ సమంత మేనేజర్ ఈ వార్తల్ని ఖండించారు. కానీ వీరి మధ్య రిలేషన్ ఉందనే వార్తలకు బలం చేకూర్చేలా ప్రతిసారి వీరిద్దరూ ఎక్కడో ఒక దగ్గర అడ్డంగా బుక్ అవుతున్నారు.

అలా తాజాగా సమంత ఈ ఏడాది దీపావళి సెలబ్రేషన్స్ ని తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి జరుపుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేయడంతో ఈ ఫొటోస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి కొత్త సినిమా గుడ్ న్యూస్ చెప్పినట్టే సమంత రెండో పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా త్వరలోనే చెబుతుందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.