Begin typing your search above and press return to search.

సీఎంను కలిసిన సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

లేడీ సూపర్ స్టార్ సమంత లీడ్ రోల్‌లో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సమంత ప్రమోషన్స్ మామూలుగా చేయడం లేదు.

By:  Madhu Reddy   |   17 Jun 2026 9:03 PM IST
సీఎంను కలిసిన సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
X

లేడీ సూపర్ స్టార్ సమంత లీడ్ రోల్‌లో, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం సమంత ప్రమోషన్స్ మామూలుగా చేయడం లేదు. ఒకే రోజులో ఏకంగా 40 ఇంటర్వ్యూలు ఇచ్చి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముగించుకుని, నేడు తమిళనాడు ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లిన సామ్.. అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలవడం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.




చెన్నైలో సామ్ ల్యాండింగ్.. సీఎం విజయ్‌తో భేటీ:

సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నైలో అడుగుపెట్టిన సమంతకు అక్కడ గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. అయితే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆమె నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌ను కలిశారు. ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులు చెన్నై వెళ్తే సీఎం విజయ్‌ను కలవడం ఒక ట్రెండ్‌గా మారింది. ఈ క్రమంలోనే సమంత కూడా ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై, ముచ్చటించారు. ఇక విజయ్‌తో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్‌ను సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.




విజయ్ సర్ కేవలం స్క్రీన్ హీరో మాత్రమే కాదు:

విజయ్‌ను కలిసిన తర్వాత సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ అండ్ ఇన్‌స్పైరింగ్ నోట్ రాశారు. "ఈరోజు చెన్నైలో ల్యాండ్ అవ్వగానే మన సీఎం గారిని కలవబోతున్నాననే సంతోషం నాలో కలిగింది. విజయ్ సర్ ఎప్పుడూ స్క్రీన్ మీదే హీరో కాదు, అంతకంటే పెద్ద స్థానానికి వెళ్లాల్సిన వ్యక్తి అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఆయన ఎనర్జీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకు ప్రజలు ఇచ్చే రెస్పాన్స్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది" అంటూ సమంత విజయ్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

ఆ ధైర్యమే నాకు పెద్ద ఇన్‌స్పిరేషన్:

సినిమాల్లో ఆల్రెడీ టాప్ పొజిషన్‌లో ఉండి, అంతా సాధించిన తర్వాత.. వాటన్నింటినీ వదిలేసి, రిస్క్ ఎక్కువగా ఉండే ఒక సరికొత్త రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడానికి ఎంతో ధైర్యం కావాలని సమంత అన్నారు. "విజయ్ సర్ కేవలం సులువుగా ఉంటుందని పాలిటిక్స్‌లోకి రాలేదు, సమాజంలో మార్పు తీసుకురాగలననే నమ్మకంతోనే వచ్చారు. ప్రజల కోసం ఏదైనా చేయాలనే పిలుపు అందరికీ వస్తుంది, కానీ కొందరే ఆ అడుగు ముందుకు వేస్తారు. ఇక విజయ్ సర్ తనను నమ్మిన వారిని కూడా ఆశ్చర్యపరిచేలా పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంది" అని సామ్ పేర్కొన్నారు.

‘మా ఇంటి బంగారం’ సినిమా కోసం వచ్చిన సమంత, ఇలా సీఎం విజయ్‌ను కలిసి అభినందనలు తెలపడం ఇరు వర్గాల అభిమానులను ఎంతగానో ఖుషీ చేస్తోంది. విజయ్‌కు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సామ్ పెట్టిన పోస్ట్ యువతకు కూడా ఒక మంచి మెసేజ్‌లా నిలిచింది. మరి చెన్నైలో సమంత చేసిన ఈ రేంజ్ హంగామా, విజయ్ తో మీటింగ్ జూన్ 19న రాబోతున్న ‘మా ఇంటి బంగారం’ (తమిళంలో ఎంగల్ తంగం) సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో చూడాలి.