సామ్ కొత్త మూవీ.. బిజినెస్ స్టార్ట్ అయిందా?
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం అప్పుడే ముందే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
By: M Prashanth | 31 Jan 2026 2:09 PM ISTస్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం అప్పుడే ముందే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓ బేబీ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత చేస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ఆ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన టీజర్ తో ఆ హైప్ మరింత పెరిగింది.
సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై, భర్త రాజ్ నిడిమోరుతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కు యాక్షన్ టచ్ కలిపిన కథతో సినిమా రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. గ్లింప్స్ ప్రారంభంలో 'ఎట్లాగో ఇక్కడివరకు వచ్చినాం కదా.. ఉండిపోదాం' అనే సమంత డైలాగ్‌తో స్టోరీకి ఎమోషనల్ టోన్ సెట్ చేశారు.
అత్తగారింట్లో కలిసిపోవడానికి ప్రయత్నించే అమాయక కోడలిగా కనిపించిన సమంత, ఒక్కసారిగా యాక్షన్ అవతార్ లో అదరగొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చీరకట్టు, బొట్టు లుక్‌లో క్లాస్‌గా కనిపిస్తూనే, బస్‌లో ఫైట్ సీన్స్, ఇంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. రెండు షేడ్స్ లో సమంత కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
కథను రాజ్ నిడిమోరు, వసంత్ మరిగంటి అందించగా, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్ టీమ్ సపోర్ట్ ఉండటం కూడా సినిమాకు అదనపు బలం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే టీజర్ కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో సినిమా బిజినెస్ పై డిస్ట్రిబ్యూటర్ల దృష్టి పడింది. షూటింగ్ ఎంతవరకు పూర్తైందో తెలియకపోయినా, ప్రీ రిలీజ్ బిజినెస్ పై చర్చలు మొదలయ్యాయి.
ప్రత్యేకంగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు కోసం రీసెంట్ గా చర్చలు మొదలైనట్లు సమాచారం. ఆ రెండు ఏరియాలు కలిపి హక్కులకు నిర్మాతలు రూ.5 కోట్లకు పైగా కోట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫైనల్ డీల్ త్వరలో క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే విధంగా ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మార్కెటింగ్ బాధ్యతలు తీసుకునే అవకాశముందనే వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అదే జరిగితే సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి సమంత సినిమా, నందిని రెడ్డి దర్శకత్వం, ఫ్యామిలీ + యాక్షన్ కథ, టీజర్ కు వచ్చిన రెస్పాన్స్.. ఇవన్నీ కలిసి మా ఇంటి బంగారంపై రిలీజ్ కంటే ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇదే జోష్ కొనసాగితే బాక్సాఫీస్ దగ్గర కూడా సామ్ మరో హిట్ అందుకునే అవకాశం కనిపిస్తోంది.
