సామ్ ఇన్వెస్ట్మెంట్ సేఫ్.. కానీ అసలు పరీక్ష అదే కదా..
అదే ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ విషయంలో కూడా చర్చనీయాంశమవుతోంది. పెట్టిన బడ్జెట్ అంతా ముందుగానే తిరిగి వచ్చిందంటే నిర్మాతగా సమంతకు ఇది పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయమే.
By: M Prashanth | 18 Jun 2026 7:10 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో రూపొందుతున్న మా ఇంటి బంగారం మూవీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తోంది. సినిమాలో నటిస్తూ.. నిర్మాతగా వ్యవహరిస్తున్న సమంత దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఓటీటీ, డిజిటల్ హక్కుల ద్వారా ఇప్పటికే ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని తిరిగి పొందిందనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఒక హీరో లేదా హీరోయిన్ స్వయంగా ప్రొడక్షన్ లో పార్టనర్ అయినప్పుడు, వారి ఇన్వెస్ట్మెంట్ మొత్తం సేఫ్ గా ఉండటం పెద్ద విషయంగానే భావిస్తారు. అదే ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీ విషయంలో కూడా చర్చనీయాంశమవుతోంది. పెట్టిన బడ్జెట్ అంతా ముందుగానే తిరిగి వచ్చిందంటే నిర్మాతగా సమంతకు ఇది పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయమే.
అయితే సినిమా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ రికవరీ ఒక్కటే సక్సెస్ కు మెజర్మెంట్ కాదు. ముఖ్యంగా ప్రేక్షకుల ముందుకు సినిమా వెళ్లే సమయంలో థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ మాత్రమే అసలు రిజల్ట్ గా ట్రీట్ చేస్తారు. ఎంత పెద్ద డిజిటల్ డీల్ జరిగినా, ఎంత మొత్తంలో రైట్స్ అమ్ముడైనా, ఆడియన్స్ లో ఆసక్తి పెరగకపోతే ఓపెనింగ్స్ పై ఎఫెక్ట్ చూపడం కష్టమే.
గతంలో సినిమా విడుదలకు ముందు ఇలాంటి వార్తలు తరచూ వినిపించేవి. సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్లింది, నిర్మాతకు పెట్టుబడి తిరిగి వచ్చింది, హక్కుల విక్రయం రికార్డు స్థాయిలో జరిగింది వంటి ప్రచారాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేవి. అప్పట్లో ఆ సమాచారం మార్కెటింగ్‌లో భాగంగా కూడా పనిచేసేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా జెనరేషన్ లో ప్రేక్షకులు కంటెంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
సినిమా బాగుంటే థియేటర్లకు వెళ్లాలనే ఆలోచన పెరిగింది. అందుకే విడుదలకు ముందు వచ్చే బిజినెస్ లెక్కలు, రైట్స్ సేల్స్ వంటి వివరాలు మాత్రమే ఆడియన్స్ ను అస్సలు ఆకర్షించలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన ఉదాహరణలు ఉన్నాయి. మరోవైపు, పెద్దగా హడావుడి లేకుండా వచ్చిన కొన్ని చిత్రాలు మంచి కంటెంట్ తో విజయాలు సాధించాయి.
దీంతో ప్రేక్షకుల నిర్ణయాన్ని ఎఫెక్ట్ చేసే ఎలిమెంట్స్ కథ, టీజర్, ట్రైలర్, మౌత్ టాక్ మాత్రమే. వాటి ఇంపార్టెన్స్ ఇప్పుడు మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం మూవీ విషయంలో సమంత బడ్జెట్ పరంగా సేఫ్ జోన్ లోకి వెళ్లిందనే వార్తలు నిర్మాత యాంగిల్ లో పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలు మాత్రమే సినిమాకు భారీ ఓపెనింగ్స్ తీసుకురావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే చివరికి చూస్తే.. డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఒక ఫైనాన్షియల్ రిలీఫ్ మాత్రమే. కానీ సినిమా సక్సెస్ ను మాత్రం డిసైడ్ చేసేది ప్రేక్షకుల జడ్జిమెంటే. మా ఇంటి బంగారం విషయంలో కూడా అసలు పరీక్ష రిలీజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. థియేటర్లలో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది ఆ మూవీ ఫ్యూచర్ ను నిర్ణయించే కీలక అంశంగా మారింది.
