Begin typing your search above and press return to search.

సమంతకు బిగ్ ప్లస్ పాయింట్.. ఎలా యూజ్ చేసుకుంటుందో?

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   13 Jun 2026 1:54 PM IST
సమంతకు బిగ్ ప్లస్ పాయింట్.. ఎలా యూజ్ చేసుకుంటుందో?
X

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఆ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాకు మరో ఎక్స్ ట్రా ప్లస్ యాడ్ అయినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

మొదట ఆ సినిమా రిలీజ్ టైమ్ లో కొన్ని మూవీలు పోటీకి వస్తాయని భావించారు. ముఖ్యంగా లెనిన్ సినిమా కూడా అదే సమయంలో బరిలో ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్యాచ్ వర్క్ పూర్తి కాకపోవడం, థియేట్రికల్ బిజినెస్‌ కు సంబంధించిన చర్చలు ఇంకా ముగియకపోవడమే ఇందుకు కారణమని వినిపిస్తోంది.

జూలైలో లెనిన్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. దీంతో మా ఇంటి బంగారం మూవీకి బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ ఉండదని తెలుస్తోంది. అఖిల్ సినిమా కూడా జూన్ 26న విడుదల కాకపోతే, సమంత సినిమాకు దాదాపు రెండు వారాల పాటు ఫ్రీగా ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం దక్కనుంది. తొలి వారంలో మంచి టాక్ తెచ్చుకుంటే, రెండో వారంలో కూడా వసూళ్ళ పరంగా ఆ చిత్రం స్ట్రాంగ్ దూసుకుపోయే ఛాన్స్ ఉందని చెప్పాలి.

అయితే సినిమాపై ఆసక్తి మరింత పెంచుతున్న అంశం సమంత పాత్ర. దర్శకురాలు నందినీ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, సాధారణ కుటుంబ కోడలిగా కనిపించే మహిళ వెనుక ఊహించని పవర్‌ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ దాగి ఉంటుంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రం కిల్ బిల్ తరహా యాక్షన్ ఎలిమెంట్స్‌ ను, తెలుగు ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిక్స్ చేస్తూ ఆ పాత్రను రూపొందించినట్లు ఆమె వెల్లడించారు.

ఇక గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాషా సినిమాలో కనిపించిన రెండు విభిన్న షేడ్స్‌ లా, సినిమాలో కూడా సమంత పాత్రకు ప్రత్యేకమైన మార్పులు ఉంటాయని చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే ఆ కంపేరిజన్ కంటే, కథలోని ఎమోషన్స్ తోపాటు యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయన్నదే కీలకం కానుంది.

అయితే మా ఇంటి బంగారం సామ్ కెరీర్‌ కు ఎంతో ముఖ్యమని చెప్పాలి. ముఖ్యంగా స్టార్ హీరో బేస్ లేకుండా పూర్తిగా సమంత ఇమేజ్‌ పైనే సినిమా బిజినెస్ జరగడం విశేషం. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఆ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ కనిపిస్తోంది. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మిస్తున్న ఆ చిత్రానికి కథను ఆమె భర్త రాజ్ నిడిమోరు అందించారు.

సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచింది. ఏదేమైనా స్ట్రాంగ్ రోల్, యాక్షన్- ఎమోషన్ మిక్స్ చేసిన కథ, సమంత క్రేజ్‌ తో పాటు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద తగ్గిన పోటీ కూడా మా ఇంటి బంగారం మూవీకి పెద్ద ప్లస్‌ గా మారింది. ఆ ఛాన్స్ ను సమంత ఎంతవరకు యూజ్ చేసుకుంటుందో, జూన్ 19న ప్రేక్షకుల జడ్జిమెంట్ ఎలా ఉంటుందో అంతా వేచి చూడాలి.