ఇది కదా సామ్ అసలైన స్టామినా..
ఒక సినిమా హిట్ అవ్వొచ్చు.. రెండు సినిమాలు సక్సెస్ కావొచ్చు. కానీ ఏళ్లు గడిచినా, కొత్త హీరోయిన్లు వచ్చినా, ఓవర్సీస్ మార్కెట్ లో తన డామినేషన్ ను అలాగే కొనసాగించడం మాత్రం అందరి వల్ల కాదు.
By: M Prashanth | 21 Jun 2026 2:42 PM ISTఒక సినిమా హిట్ అవ్వొచ్చు.. రెండు సినిమాలు సక్సెస్ కావొచ్చు. కానీ ఏళ్లు గడిచినా, కొత్త హీరోయిన్లు వచ్చినా, ఓవర్సీస్ మార్కెట్ లో తన డామినేషన్ ను అలాగే కొనసాగించడం మాత్రం అందరి వల్ల కాదు. అదే పని చేసి చూపిస్తున్నారు స్టార్ హీరోయిన్ సమంత. తాజాగా మా ఇంటి బంగారం మూవీతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్న సామ్.. ఇప్పుడు అమెరికా మార్కెట్ లో ఓ అరుదైన రికార్డుకు మరింత దగ్గరయ్యారు.
సమంత లీడ్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఆ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఆ సినిమాకు మంచి వసూళ్లు వస్తుండటంతో మేకర్స్ హ్యాపీ మోడ్ లో ఉన్నారు.
అయితే ఆ సినిమా సక్సెస్ తోపాటు ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అమెరికా బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన అత్యధిక చిత్రాలు కలిగిన హీరోయిన్ గా సమంత రికార్డు సృష్టించారు. ఆమె నటించిన 16 సినిమాలు ఆ ఘనతను అందుకున్నాయి. ఇప్పుడు మా ఇంటి బంగారం త్వరలోనే 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీకెండ్ ముగిసే టైమ్ కు ఆ మార్క్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే అమెరికా మార్కెట్ లో 17 మిలియన్ డాలర్ చిత్రాలు కలిగిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్ గా సమంత మరో క్రేజీ రికార్డును తన పేరిట నమోదు చేసుకోనున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఆ రేంజ్ ఓవర్సీస్ ట్రాక్ రికార్డు చాలా అరుదని సినీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
సమంత కెరీర్ ను పరిశీలిస్తే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా భారీ విజయాలు అందుకోవడం ఆమె ప్రత్యేకతగా కనిపిస్తుంది. ఓ బేబీ, యశోద వంటి సినిమాలు మంచి విజయాలు సాధించగా, ఇప్పుడు మా ఇంటి బంగారం కూడా అదే జాబితాలో చేరేలా కనిపిస్తోంది. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా, ప్రేక్షకుల్లో సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఇప్పుడు వసూళ్లు క్లారిటీ ఇస్తున్నాయి.
ఇక ఆ సినిమా ఓపెనింగ్స్ కూడా హాట్ టాపిక్ గా మారాయి. లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కిన చిత్రానికి ఆ రేంజ్ లో రెస్పాన్స్ రావడం విశేషం. ముఖ్యంగా లేడీ ఆడియన్స్ నుంచి వచ్చిన సపోర్ట్ సినిమాకు మెయిన్ అసెట్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకే పరిమితమైన ఓవర్సీస్ రికార్డుల చర్చలో ఇప్పుడు సమంత పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.
కంటెంట్ పై నమ్మకం పెట్టుకుని సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు వరుస మైల్ స్టోన్స్ తో ముందుకు సాగుతున్నారు. అందుకే మా ఇంటి బంగారం విజయాన్ని చూసిన అభిమానులు.. రికార్డులు రావడం కొత్త కాదు.. కానీ వాటిని ఏళ్లపాటు కాపాడుకుంటూ మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం మాత్రం సమంతకే సాధ్యమైందని చెబుతున్నారు. ఇదే కదా సామ్ అసలైన స్టామినా అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
