Begin typing your search above and press return to search.

తగ్గిన సమంత 'బంగారం' .. ఒరిజినల్ రీజన్ ఇదేనా?

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   7 May 2026 3:00 PM IST
తగ్గిన సమంత బంగారం .. ఒరిజినల్ రీజన్ ఇదేనా?
X

స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత సమంత పూర్తి స్థాయి పవర్‌ ఫుల్ రోల్ లో కనిపించనున్న ఆ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఆ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది. సాధారణ గృహిణిలా కనిపించే మహిళ.. అవసరమైతే ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనే పవర్ ఫుల్ లేడీగా మారే పాత్రలో సమంత కనిపించనుందనే టీజర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఉమెన్ ఓరియంటెడ్ స్టోరీతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ ను జూన్ 19కు మార్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో వాయిదా వేయడానికి ఐపీఎల్ కారణమని మూవీ టీమ్ చెబుతోంది.

ఐపీఎల్ సీజన్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గే అవకాశం ఉండటంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా పెద్ద సినిమాలు, కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ గా పెట్టుకున్న చిత్రాలపై ఐపీఎల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని అంతా భావిస్తుంటారు. అయితే ఇప్పుడు నెట్టింట మరో టాక్ వినిపిస్తోంది. ఐపీఎల్ కారణం కేవలం ఒక ఎక్స్క్యూస్ మాత్రమేనని ప్రచారం జరుగుతోంది.

అసలు సమస్య థియేటర్లు దొరకకపోవడమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారీ సినిమాల పోటీ, థియేటర్ల కేటాయింపు సమస్యల కారణంగా మా ఇంటి బంగారం మూవీకి సరైన రిలీజ్ ప్లానింగ్ కుదరలేదని అంటున్నారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా థియేటర్లపై భారీ ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో.. ఆ సినిమా రన్ పూర్తయ్యాక సమంత సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావించినట్లు టాక్ నడుస్తోంది.

మంచి రిలీజ్ టైమ్ దొరికితేనే సినిమాకు కలెక్షన్లు స్ట్రాంగ్ గా వచ్చే అవకాశం ఉందని మేకర్స్ లెక్కలు వేసుకుంటున్నారట. ఇక సమంత అభిమానులు మాత్రం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ కథలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న సమంత.. మా ఇంటి బంగారం చిత్రంతో మరోసారి తన యాక్టింగ్ లోని మరో యాంగిల్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విడుదల లేట్ అయినా సరే.. మంచి కంటెంట్‌ తో వస్తే సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.