Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ ప్రకటించిన సమంత 'మా ఇంటి బంగారం'.. ఆ రోజే ఎందుకంటే?

వ్యక్తిగతంగానే కాకుండా అటు ఆరోగ్యపరంగా మయోసైటీస్ వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. ఏడాది పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి మళ్లీ గట్టి కంబ్యాక్ ఇచ్చింది.

By:  Madhu Reddy   |   23 Feb 2026 9:18 AM IST
రిలీజ్ డేట్ ప్రకటించిన సమంత మా ఇంటి బంగారం.. ఆ రోజే ఎందుకంటే?
X

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతూ.. అటు ఆర్మాక్స్ మీడియా సర్వేలో కూడా ఎప్పటికప్పుడు టాప్ టెన్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటూ దూసుకుపోతున్న సమంత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల విషయంలో వార్తలో నిలిచిన ఈమె.. ఆ తర్వాత విమర్శలు ఎదుర్కొని కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. వ్యక్తిగతంగానే కాకుండా అటు ఆరోగ్యపరంగా మయోసైటీస్ వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె.. ఏడాది పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి మళ్లీ గట్టి కంబ్యాక్ ఇచ్చింది.




ముచ్చటగా మూడోసారి నందిని రెడ్డి డైరెక్షన్లో..

ఆ తర్వాత 'సిటాడెల్ :హనీ బన్నీ' వెబ్ సిరీస్ తో సంచలనం సృష్టించి పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. పైగా బాలీవుడ్ లో తన కెరియర్ కు పునాదులు వేసిన రాజ్ నిడిమోరుతో గత ఏడాది ఏడడుగులు వేసిన ఈమె.. ఇప్పుడు తెలుగు సినిమాలపై దృష్టి సారించింది. అందులో భాగంగానే తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై 'శుభం' అనే సినిమాను నిర్మించి, నిర్మాతగా సక్సెస్ అయిన ఈమె.. మళ్ళీ తన బ్యానర్ లోనే 'మా ఇంటి బంగారం' అనే సినిమాను నిర్మించడమే కాకుండా నటిస్తోంది కూడా.. ప్రముఖ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం ఇది.

మా ఇంటి బంగారం రిలీజ్ డేట్ ప్రకటించిన సమంత..

ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో 'జబర్దస్త్' సినిమా వచ్చి ఫ్లాప్ అయింది. ఆ తర్వాత 'ఓ బేబీ' సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఇటీవల ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ లో కూడా సమంత తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ షేర్ చేసిన పోస్ట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది.

మే 15న సమ్మర్ స్పెషల్ గా..

ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి.. వేసవిలో అభిమానులను చిల్ చేయడానికి సమంతా మే 15వ తేదీన 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసిన పోస్టర్ కూడా వైరల్ గా మారింది

ఆ రోజే ఎందుకు?

ఇకపోతే సమంత 15వ తేదీనే ఎందుకు మా ఇంటి బంగారం సినిమాను తీసుకొస్తోంది? ఆరోజే ఎందుకు? అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మే 15న "అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం " ఈ సందర్భంగానే ఆమె తన మా ఇంటి బంగారం అనే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తానికైతే పక్కా ప్లానింగ్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సమంత..ఈ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. తెలుగులో రీ ఎంట్రీలో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నా సమంతకి ఈ సినిమా సక్సెస్ అందివ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథను అందించగా.. రాజ్ నిర్మాణ సారధ్యంలో ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత నిర్మిస్తోంది. ఇక ఇందులో శ్రీముఖి కూడా కీలకపాత్ర పోషిస్తుంది.