Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన సమంత.. హీరోయిన్లకు అతిపెద్ద సవాల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

By:  Madhu Reddy   |   12 July 2026 5:00 PM IST
చరిత్ర సృష్టించిన సమంత.. హీరోయిన్లకు అతిపెద్ద సవాల్!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. రిలీజై 24 రోజులు దాటినా ఈ సినిమా కలెక్షన్ల హవా అస్సలు తగ్గడం లేదు. తాజాగా మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయిని దాటేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.




టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్:

ఇప్పటివరకు వంద కోట్ల మార్క్‌ను ఎక్కువగా హీరోల సినిమాలే దాటాయి.కానీ ఒక హీరోయిన్ మెయిన్ లీడ్‌గా వచ్చిన సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డ్. ఇక ఈ భారీ సక్సెస్‌తో సమంత తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో దేశవ్యాప్తంగా మరోసారి నిరూపించింది. భవిష్యత్తులో రాబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ‘మా ఇంటి బంగారం’ ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిపోనుంది.

అదిరిపోయిన సమంత-నందిని రెడ్డి కాంబో:

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసింది. ఇక నందిని రెడ్డి మార్క్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో 24వ రోజు కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

ఓన్ బ్యానర్‌లోనే భారీ సక్సెస్:

ఈ సినిమాకు మరో స్పెషల్ ఏమిటంటే… సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రొడ్యూసర్‌గా మారిన మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం సమంత కెరీర్‌లో ఒక మైండ్‌బ్లోయింగ్ అచీవ్‌మెంట్ అని చెప్పాలి.

సర్‌ప్రైజ్ వీడియో:

వెకేషన్ టైమ్‌లో భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “రిలీజ్‌కు ముందే హీరోయిన్ సినిమా ఆడదేమో అని అన్నారు… కానీ డేరింగ్ ఉంటేనే విజయాలు వస్తాయని సినిమా నిరూపించింది. అని పేర్కొన్నారు. ఈ వీడియోలో సమంత బేబీ బంప్‌తో హ్యాపీ గా కనిపించారు.

సమంత వన్-వుమెన్ షోగా వచ్చిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా కంటెంట్ నమ్ముకుంటే థియేటర్లు ఎలా కళకళలాడుతాయో ఈ సినిమా నిరూపించింది. మరి రాబోయే రోజుల్లో ఈ విజువల్ వండర్ ఇంకెన్ని వసూళ్ల రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.