Begin typing your search above and press return to search.

నో వేరియేషన్.. ఓన్లీ ప్రమోషన్.. సమంతకు హిట్ పక్కానా?

అందుకే ఇప్పుడు కథ ఎంత ముఖ్యమో, ప్రమోషన్స్ కూడా అంతే కీలకంగా మారింది. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. తన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం కోసం బాగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

By:  M Prashanth   |   16 Jun 2026 12:04 PM IST
నో వేరియేషన్.. ఓన్లీ ప్రమోషన్.. సమంతకు హిట్ పక్కానా?
X

ఒకప్పుడు ప్రమోషన్స్ అంటే ఆడియో ఈవెంట్, రెండు మూడు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో సరిపెట్టేవారు. కానీ ఓటీటీల ఎఫెక్ట్ పెరగడంతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈజీ కావడం లేదు. అందుకే ఇప్పుడు కథ ఎంత ముఖ్యమో, ప్రమోషన్స్ కూడా అంతే కీలకంగా మారింది. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. తన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం కోసం బాగా కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది.

జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ ఫ్యామిలీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్‌ కు సంబంధించిన ప్రమోషన్స్‌ లో సమంత చూపిస్తున్న డెడికేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సండే నాడు ఒక్కరోజే ఆమె ఏకంగా 40 వీడియో ఇంటర్వ్యూలు ఇచ్చినట్లు సమాచారం. మార్నింగ్ 11 గంటల సమయంలో ప్రారంభమైన ఆ ఇంటర్వ్యూలు రాత్రి వరకు కొనసాగాయని తెలుస్తోంది.

సాధారణంగా పెద్ద సినిమాల ప్రమోషన్స్ లో సెలెక్ట్ చేసిన కొన్ని మీడియా సంస్థలకు సమయం కేటాయిస్తారు. అయితే సమంత మాత్రం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పలు డిజిటల్, యూట్యూబ్, మీడియా సంస్థలకు సమయం ఇచ్చినట్లు సమాచారం. ప్రతి ఇంటర్వ్యూ సమయం తక్కువగా ఉన్నప్పటికీ, ప్రతి ప్రశ్నకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. రైటర్, సహ నిర్మాత రాజ్ నిడిమోరు సతీమణికి తోడుగా పాల్గొనడం విశేషం.

అయితే సినిమాపై నమ్మకం ఉన్నప్పుడు ఇలాంటి స్థాయిలో ప్రమోషన్స్ చేస్తారని పలువురు మూవీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉమెన్ ఓరియెంటెడ్ స్టోరీతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం కోసం ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. అదే ప్లాన్ ను మా ఇంటి బంగారం టీమ్ ఇప్పుడు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

అదే సమయంలో ఇంత భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే సినిమా విజయం ఖాయమేనా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ప్రమోషన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగలవు. మంచి ఓపెనింగ్స్ తీసుకురాగలవు. కానీ చివరికి సినిమా ప్యూచర్ ను డిసైడ్ చేసేది కంటెంట్, ప్రేక్షకుల మౌత్ టాక్ మాత్రమే. తొలి రోజు థియేటర్లకు ప్రేక్షకులను తీసుకురావడంలో ప్రమోషన్స్ పాత్ర ఉంటే, రెండో రోజు నుంచి సినిమాను నిలబెట్టేది కంటెంట్‌ నే.

ఇక సమంత విషయానికి వస్తే, గతంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ఈసారి కంప్లీట్ యాక్షన్ కామెడీ జోనర్‌ లో కనిపించనున్నారు. అంతేకాదు, తన సినిమా కోసం పర్సనల్ గా సమయం కేటాయిస్తూ ప్రమోషన్స్ బాధ్యతలను భుజాన వేసుకోవడం ఆమె కమిట్మెంట్ కు ఎగ్జాంపుల్ గా అభిమానులు భావిస్తున్నారు. ఏదేమైనా మా ఇంటి బంగారం కోసం సమంత మారథాన్ ప్రమోషన్ ప్లాన్ ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

ఒకే రోజులో 40 ఇంటర్వ్యూలతో సినిమాపై దృష్టిని ఆకర్షించడంలో ఆమె సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే ఆ ప్రమోషన్స్ హడావిడి బాక్సాఫీస్ వద్ద బంగారంగా మారుతుందా? కంటెంట్ ఎగ్జామ్ లో మంచి రిజల్ట్ సాధిస్తుందా? లేదా? అన్నది మాత్రం జూన్ 19 తర్వాత తెలియనుంది. ప్రస్తుతం మాత్రం సమంత చూపించిన డెడికేషన్‌ కు సినీ ప్రియుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.