సమంత ఛాన్స్ కళావతి తన్నుకుపోయిందా?
ఏకంగా సీనియర్ అయిన సమంతనే పక్కన బెట్టి కీర్తి సురేష్‌ని ఓ ప్రాజెక్ట్ కి ఎంపిక చేసారు? అన్నది బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
By: Srikanth Kontham | 2 Nov 2025 6:00 PM ISTటాలీవుడ్ హీరోయిన్ల మధ్య బాలీవుడ్ లో పోటీ నెలకొందా? ఒకరి అవకాశం కోసం మరొకరు పోటీ పడుతున్నారా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా బాలీవుడ్ లో పాగా వేసిన సంగతి తెలిసిందే. వరుస అవకాశాలో బాలీవుడ్ భామలకే పోటీగా మారింది. సీనియర్ హీరోయిన్లకే అమ్మడు అక్కడ చెమటలు పట్టిస్తోంది. ఫలానా సినిమాలో తాను నటించాలని కర్చీప్ వేసిందంటే? దాన్ని తొలగించే సాహసం ఏ నటి చేయలేకపోతుంది. అలాగే సమంత, కీర్తి సురేష్ లాంటి భామల మధ్య కూడా పోటీ నెలకొంది? అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సమంతకు షాక్ ఇచ్చిన మరో నటి:
ఏకంగా సీనియర్ అయిన సమంతనే పక్కన బెట్టి కీర్తి సురేష్‌ని ఓ ప్రాజెక్ట్ కి ఎంపిక చేసారు? అన్నది బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజ్ కుమార్ రావు హీరోగా ఆదిత్య నింబాల్కర్ ఓ చిత్రానికి సన్నాహాలు
చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా తొలుత సమంతను తీసుకోవాలనుకున్నారుట. దీనిలో భాగంగా విషయం కూడా ఆమెకు చెప్పి ఆఫీస్ కు పిలిపించారుట. ఆమె తోపాటు మరో నాయికగా తాన్యా మణిక్త్ తో కూడా చర్చలు జరిపారుట. కానీ ఏం జరిగిందో తెలియదు గానీ సమంత స్థానంలో ఇప్పుడు మరో సౌత్ నటి అయిన కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి.
బాలీవుడ్ తో సామ్ గుడ్ రిలేషన్ షిప్:
ఆ పాత్రకు సామ్ కంటే కీర్తి అయితే పర్పెక్ట్ గా సూటువుతుందని మేకర్స్ భావించే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవాలు తెలియాల్సి ఉంది. సమంత కూడా కొంత కాలంగా బాలీవుడ్ అవకాశాల కోసం ఎంత సీరియస్ గా ప్రయత్నిస్తుందో తెలిసిందే? కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ కి వెళ్లినా? ఆమె కంటే సామ్ సీరియస్ గా ఛాన్సు ల కోసం ట్రై చేస్తోంది. ఇప్పటికే అక్కడ ట్రెండ్ కు తగ్గట్టు మౌల్డ్ అయింది. పరిచయాలు అంతకంతకు పెంచుకుంటుంది. రిలేషన్ షిప్స్ విషయంలోనూ అమ్మడు అంతే ఓపెన్ గా ఉంటుంది.
బాలీవుడ్ లో సౌత్ భామల డిమాండ్:
ఇంకా చెప్పాలంటే కీర్తి సురేష్ కంటే సమంతకే బాలీవుడ్ తో ఎక్కువ ర్యాపో ఉంది. కానీ బాలీవుడ్ ని ఆమెనే పక్కన బెట్టి మరో సౌత్ నటికి అవకాశం కల్పించడం ఆశ్చర్యకరం. మరి దీని వెనుక కీర్తి సైలెంట్ ఆపరేషన్ ఏమైనా చేపట్టిందా? అన్నది తెలియాలి. అవకాశాల పరంగా ఏ పరిశ్రమలోనైనా హీరోయిన్ల మధ్య పోటీ సహజం. ఆ పోటీ స్థానిక నాయికల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ పరభాషలో కూడా సౌత్ నాయికలు పోటీ పడటం అంటే అక్కడ దక్షిణాది భామల ప్రాముఖ్యత ఎంతగా పెరగిందన్నది ఈ సన్నివేశం అద్దం పట్టేలా చేస్తోంది.
