జోరు పెంచిన సమంత.. సినిమాలే కాదు, అలా కూడా!
ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో కంబ్యాక్ ఇవ్వాలని వరుస సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు సైన్ చేస్తున్నారు సమంత.
By: Sravani Lakshmi Srungarapu | 9 Oct 2025 4:31 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, హీరోయిన్ గా నటించడమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్న సమంత, పర్సనల్ రీజన్స్ వల్ల గత కొంతకాలంగా సైలెంట్ అయిన విషయం తెలిసిందే.
పలు బ్రాండ్లకు ఓనర్ గా..
ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో కంబ్యాక్ ఇవ్వాలని వరుస సినిమాలకు, వెబ్‌సిరీస్‌లకు సైన్ చేస్తున్నారు సమంత. అయితే సమంత కేవలం నటిగానే కాకుండా ఎంట్రప్రెన్యూర్ గా కూడా రాణిస్తున్నారు. ఆల్రెడీ సాకి, ఓ పెర్ఫ్యూమ్ లైన్ మరియు ఏకాం లాంటి స్కూల్ బ్రాండ్స్ కు ఓనర్ అయిన సమంత ఇప్పుడు తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు చేపట్టారు.
జోయాలుక్కాస్ కు ప్రచారకర్తగా..
ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ తాజాగా తమ ప్రచారకర్తగా సమంతను నియమించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో తమ డిజైన్లు, ఆభరణాల నైపుణ్యాన్ని సమంత తనదైన శైలిలో పరిచయం చేస్తారని సంస్థ చైర్మన్ జాయ్ ఆలుక్కాస్ అన్నారు. నేటి మహిళల ఆత్మవిశ్వాసం, శైలి, ప్రత్యేక గుర్తింపును సమంత ప్రతిబింబించనున్నారని, ఆమె జోయాలుక్కాస్ ఫ్యామిలీలో భాగమవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
కాగా జోయాలుక్కాస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సమంత, ఆభరణాలు ఎప్పుడూ వ్యక్తిగత శైలిని తెలియచేసే మార్గంగా తాను భావిస్తానని, ప్రతీ జ్యుయలరీ వెనుక ఎన్నో ఎమోషన్స్, సెలబ్రేషన్స్ తో లాంటివి జోయాలుక్కాస్ లో ఉన్నాయని, అందానికి ప్రాధాన్యతనిచ్చే ప్రతీ మహిళను ఆత్మవిశ్వాసంతో ప్రకాశించేలా ప్రోత్సహించే బ్రాండ్ తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
కాజోల్ తో కలిసి..
సమంతకు ఫ్యాషన్, లగ్జరీలో మంచి పట్టు ఉండగా, దాన్ని మరింత పెంచుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇదిలా ఉంటే ఈ సంస్థకు బాలీవుడ్ నటి కాజోల్ ఇప్పటికే బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, ఇకపై సమంత కూడా కాజోల్ తో పాటూ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. గత కొన్నాళ్లుగా కెరీర్ విషయంలో స్లో గా ఉన్న సమంత ఇకపై స్పీడప్ చేసి బిజీగా మారాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సమంత రీసెంట్ గా కోలీవుడ్ లో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. మొత్తానికి సమంత కెరీర్ లో జోష్ పెంచారనే చెప్పాలి.
