ఏంటిది? బేబి బంప్‌తో సమంత ప్రయోగాలు!
సమంత తాజాగా షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఫొటోను మెటర్నిటీ ఫోటోషూట్‌గా భావించాలంటూ సరదా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అభిమానులు గర్భధారణ శుభాకాంక్షలు తెలపగా, పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. డిసెంబర్‌లో తొలి బిడ్డకు జన్మనివ్వనున్న సమంత ఈ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
By: Sivaji Kontham | 10 Nov 2026 12:34 AM ISTకొంత కాలంగా సమంత ఇన్‌స్టా రీల్స్ పరిశీలిస్తుంటే బేబి బంప్‌తో చేయాల్సిన ప్రయోగాలు ఎన్ని ఉంటాయో స్పష్ఠంగా తెలుసుకోవచ్చు. జిమ్ లో బరువైన డంబెల్ ని ఒక పద్ధతి ప్రకారం ఎత్తుతూ సమంత చేసిన సాహసం కూడా ఇన్ స్టా పేజీలో కనిపిస్తోంది. ఇక సమంత తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం- స్ట్రెంగ్త్ గురించి చాలానే ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. వీలున్నప్పుడల్లా సుష్టుగా తింటోంది. అలా తినడంతో పొట్ట మరింత ఉబ్బి పైకి ఎత్తుగా కనిపిస్తోంది.
ఇప్పుడు అలాంటి ఒక ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి ఫన్నీ కొటేషన్ ఇచ్చింది. ``దీనినే నా మెటర్నిటీ ఫోటోషూట్ గా భావించండి`` అని రాసింది. ఇది చూడగానే ఇదే నిజమైన ఫోటోషూట్ అనుకుని కన్ఫ్యూజ్ అయిన చాలా మంది సమంతకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఒక నెటిజన్ అయితే ``ఆదివారం బాగా బిరియానీ తిన్న తర్వాత నా పొట్ట పరిస్థితి కూడా ఇదే`` అంటూ జోకులేసారు. ఇది దీపావళి విందు తర్వాత! అంటూ కొందరు జోక్ చేసారు. సమంత బెస్ట్ ఫ్రెండ్ నీరజ కోన అయితే బెస్ట్ పోస్ట్ అంటూ ఎంకరేజ్ చేసారు.
మొత్తానికి సమంత తాజా ఫోటోగ్రాఫ్ కి వెబ్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ ఫోటోగ్రాఫ్ ని ఫ్యాన్స్ వైరల్ గా షేర్ చేస్తున్నారు. దర్శకనిర్మాత రాజ్ నిడిమోరును పెళ్లాడిన తర్వాత సమంత జీవితంలోకి ఆనందం వచ్చింది. ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి రెడీగా ఉంది. ఈ ఆనందాన్ని సామ్ అస్సలు దాచుకోవడం లేదు.
మొన్నటికి మొన్న మా ఇంటి బంగారం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని కెరీర్ పరంగా ఎంతో జోష్ తో ఉండగా, ఇప్పుడు తన తొలి సంతానం ఇంటికి వస్తున్న సందర్భంగా మరింత ఆనందంగా కనిపిస్తోంది. సమంతలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఆ కళ్లలో మెరుపులు కనిపిస్తున్నాయి. శరీరంలో కొత్త తేజస్సు కనిపిస్తోంది. ఇదంతా కడుపులో ఉన్న బేబి మహత్యం. ఈ అరుదైన క్షణాలను ఇలానే ఆనందించనివ్వండి అంటూ నెటిజనులు విష్ చేస్తున్నారు. మొన్న జూన్ లో గర్భధారణను కన్ఫామ్ చేసిన సమంత డిసెంబర్ లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.
