Begin typing your search above and press return to search.

బంగారం మేలిమ బంగార‌మ‌య్యేనా?

స‌మంత వెండితెర‌పై హీరోయిన్ గా క‌నిపించి రెండున్న‌రేళ్లు అవుతోంది. 'ఖుషీ' త‌ర్వాత అమెరికా ప‌య‌నం.. తిరి గొచ్చిన త‌ర్వ‌త వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్లోనే బిజీ అయింది.

By:  Srikanth Kontham   |   8 Feb 2026 5:00 AM IST
బంగారం మేలిమ బంగార‌మ‌య్యేనా?
X

స‌మంత వెండితెర‌పై హీరోయిన్ గా క‌నిపించి రెండున్న‌రేళ్లు అవుతోంది. `ఖుషీ` త‌ర్వాత అమెరికా ప‌య‌నం.. తిరి గొచ్చిన త‌ర్వ‌త వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల్లోనే బిజీ అయింది. మ‌ధ్య‌లో `శుభం` చిత్రంలో గెస్ట్ అపిరియ‌న్స్ ఇచ్చింది. తాను నిర్మించిన సినిమా కావ‌డంతో? అలా క‌నిపించి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత రాజ్ నిడి మోరుతో వివాహం..వెకేష‌న్ అంటూ నెట్టింట వైర‌ల్ అయింది. ప్ర‌స్తుతం `మా ఇంటి బంగారం` అనే లేడీ ఓరియేం టెడ్ చిత్రంలో న‌టిస్తోంది. త‌న‌ని సోలో నాయిక‌గా ప్రోజెక్ట్ చేసే స‌త్తా నందిని రెడ్డికే ఉందంటూ న‌మ్మి అవ‌కాశం ఇచ్చింది.

తానే స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదే ఏడాది సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా త‌ర్వాత స‌మంత జ‌ర్నీ ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. తానేంత మేలిమ బంగారంగా ప‌నిచేస్తుంది? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌థ‌లు, పాత్ర‌ల విష‌యంలో స‌మంత సెల‌క్ష‌న్ ఎలా ఉంటుంది? కొత్త‌గా జీవితంలో కి భాగ‌స్వామిని ఆహ్వానించిన నేప‌థ్యంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రం. సామ్ కెరీర్ ఆరంభంలోనే బోల్డ్ గా న‌టించింది. నాగ చైత‌న్య తో లిప్ లాక్ స‌న్నివేశంలో న‌టించి సంచ‌ల‌న‌మైంది.

కానీ ఆ త‌ర్వాత సామ్ న‌టిగా ఎదిగే కొద్ది అలాంటి స‌న్నివేశాల‌కు పూర్తిగా దూర‌మైంది. తెర‌పై గ్లామ‌ర్ హైలైట్ అయిం ది లేదు. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లు...క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లోనే కొన‌సాగింది. `పుష్ప ది రైజ్` లో మాత్రం `ఊ అంటావా మావ` పాట‌లో బోల్డ్ అప్పిరియ‌న్స్ తో ఆక‌ట్టుకుంది. ఆ పాట‌తో పాన్ ఇండియాలో సంచ‌లన‌మైంది. కానీ ఆ వెంట‌నే మ‌ళ్లీ అలాంటి పాట‌ల్లో న‌టించ‌న‌ని నిర్ణ‌యం అంతే వేగంగా తీసుకుంది. స‌మంత నుంచి ఈనిర్ణ‌యం అభి మానుల‌కు షాకింగ్ గానే అనిపించింది. గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో రాణించాలంటే పోటీని త‌ట్టుకోవాలి.

అది జ‌ర‌గాలంటే? ద‌ర్శ‌కుల హీరోయిన్ గా ప‌ని చేయాలి. కానీ అందుకు భిన్నంగా సామ్ ప్ర‌యాణం కొన‌సాగుతోంది. బాలీవుడ్ కి వెళ్లిన కొత్త‌లో అమ్మ‌డు అక్క‌డ క‌ల్చ‌ర్ కు త‌గ్గ‌ట్టే హైలైట్ అయింది. చిట్టి పొట్టి దుస్తుల్లో అల‌రించింది. సీటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లో ఏమాత్రం రాజీ ప‌డ‌కుండా ప‌ని చేసింది. కానీ ఇదంతా రాజ్ నిడిమోరుతో వివాహం..ప్రేమ‌కు ముందు జ‌రిగిన తంతు. కాల‌క్ర‌మంలో కొన్ని ర‌కాల‌ మార్పులు తీసుకొచ్చింది. మ‌రి ఇదే మార్పును భ‌విష్య‌త్ కాలంలోనూ కొన‌సాగిస్తుందా? అవ‌స‌రం మేర ప‌రిమితుల్ని ప‌క్క‌న బెడుతుందా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం స‌మంత ముంబైలో ఉంటుంది. అవ‌స‌రం మేర హైద‌రాబాద్ వ‌చ్చి వెళ్తోంది.