Begin typing your search above and press return to search.

సామ్ మేకోవర్.. ఇది నెవ్వర్ బిఫోర్!

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వివిధ పోస్టులతో తెగ సందడి చేస్తుంటారు.

By:  M Prashanth   |   22 Aug 2025 5:00 AM IST
సామ్ మేకోవర్.. ఇది నెవ్వర్ బిఫోర్!
X

స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వివిధ పోస్టులతో తెగ సందడి చేస్తుంటారు. రీసెంట్ గా ఆమె గ్రాజియా ఇండియా అనే ఫ్యాషన్ మ్యాగజైన్ పై దర్శనమిచ్చారు. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పటికే బయటకు రాగా.. ఇంకా ట్రెండింగ్ లో ఉన్నాయి.

వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రాజియా షేర్ చేయగా.. నెటిజన్లు, సినీ ప్రియులను మెప్పిస్తున్నాయి. 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులు, ఝుంకాలు, నెక్లెస్‌ తో ఉన్న సామ్ లుక్ కు ఫిదా అవుతున్నారు. సామ్ నెవ్వర్ బిఫోర్ లుక్ అని చెబుతున్నారు. చాలా బాగుందంటూ కొనియాడుతున్నారు.

సామ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు గ్రాజియా మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసిన పిక్స్ ను షేర్ చేస్తూ తమ సోషల్ మీడియా వాల్స్ పై వైరల్ చేస్తున్నారు. తెగ ట్రెండ్ చేస్తున్నారు. అందాల బొమ్మ అంటూ కొనియాడుతున్నారు. సామ్ వల్ల ఆ బంగారు ఉంగరం, గాజులు, నెక్లెస్ కే అందం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.

ఇక కెరీర్ విషయానికొస్తే.. సిల్వర్ స్క్రీన్ పై సమంతను చూసి రెండేళ్లు అయిపోయింది. విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ తర్వాత మళ్లీ లీడ్ రోల్ లో సందడి చేయలేదు. రీసెంట్ గా శుభం సినిమాతో నిర్మాతగా డెబ్యూ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గా ఫస్ట్ మూవీతో పాస్ అయ్యారు. ఆ సినిమాలో గెస్ట్ రోల్ లో కూడా కనిపించి సందడి చేశారు.

ప్రస్తుతం సామ్ రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌ డమ్‌ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఆ సిరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఆ సిరీస్.. 2025లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు సిరీస్ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో మా ఇంటి బంగారం మూవీని సామ్ ఇప్పటికే ప్రకటించారు. నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇవి తప్ప సమంత ఇప్పటివరకు వేరే కమిట్మెంట్స్ ఇవ్వలేదు. రామ్ చరణ్ పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.