పెర్ఫెక్ట్: అబ్బాయిలను సైతం ఆశ్చర్యపరుస్తూ..
తాజాగా బ్లాక్ జిమ్ డ్రెస్ లో కనిపించిన ఈమె.. తన బలాన్ని చూపిస్తూ వెనుక నుండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
By: Madhu Reddy | 27 Oct 2025 9:00 PM ISTఒకప్పుడు హీరోయిన్స్ కేవలం హీరో సరసన నటించడానికి మాత్రమే పనికొస్తారు అనే అపోహ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వార్తలను పూర్తిగా చెరిపివేస్తూ ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధం అంటూ నిరూపిస్తున్నారు. ముఖ్యంగా హీరోలతో పోటీ పడుతూ యాక్షన్ సన్నివేశాలలో కూడా నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇందుకోసం పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేయడానికి నిత్యం జిమ్ములో కష్టపడిపోతూ కండలు తిరిగిన దేహాన్ని పొందుతూ అటు సెలబ్రిటీలనే కాదు ఇటు అభిమానులను, అబ్బాయిలను కూడా ఆశ్చర్యపరుస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ కండలు తిరిగిన దేహాన్ని వెనుక నుంచి చూపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన నెటిజన్స్ పర్ఫెక్ట్ బాడీ బిల్డర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఎవరో కాదు యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. స్టార్ హీరోయిన్ సమంత. ఒకప్పుడు అల్లరిగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న సమంత ఈమధ్య ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సిటాడెల్ సినిమాతో నటనలో విశ్వరూపం చూపించిన సమంత.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది. ఒకవైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే.. మరొకవైపు సినిమాల ద్వారా అభిమానులను మెప్పించడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అందుకే మంచి ట్రైనర్ సమక్షంలో వర్కౌట్స్ చేస్తూ తన బాడీని ఫిట్గా ఉంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉండగా.. నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను అలాగే సినిమాకు సంబంధించిన విషయాలను షేర్ చేసే ఈమె.. పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా జిమ్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా బ్లాక్ జిమ్ డ్రెస్ లో కనిపించిన ఈమె.. తన బలాన్ని చూపిస్తూ వెనుక నుండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. జిమ్ సెంటర్ నుంచి షేర్ చేసిన ఈ ఫోటోలు చూసిన అభిమానులు సమంత బాడీ బిల్డ్ కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత విషయానికి వస్తే.. మయోసైటీస్ వ్యాధి నుండి తేరుకోవడానికి ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించిన ఈమె.. ఇప్పుడు ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి శుభం అనే సినిమా నిర్మించింది. ఈ సినిమాలో చిన్న పాత్ర కూడా పోషించింది. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న సమంత.. ఇప్పుడు తన సొంత బ్యానర్ లోనే 'మా ఇంటి బంగారం' అనే సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మరొకవైపు బాలీవుడ్ లో 'రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్' అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డికే దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటు సినిమా అటు వెబ్ సిరీస్ ఏకకాలంలో రిలీజ్ చేయాలని కూడా సమంత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
