దర్శకుడు రాజ్ తో కుటుంబ సమేతంగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్న సమంత..
సమంత త్వరలోనే మా ఇంటి బంగారం అనే సినిమాలో కనిపించనుంది.
By: Priya Chowdhary Nuthalapti | 21 Oct 2025 9:51 AM ISTSamantha Raj
సమంత, దర్శకుడు రాజ్ ప్రేమలో ఉన్నారు అన్న వార్త ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతూనే ఉంది. కానీ దీని గురించి వీరిద్దరూ కూడా స్పందించలేదు. అయితే ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూ.. ఈ వార్తలకు బలం మాత్రం చేకూరుస్తూనే.. ఉన్నారు వీరు ఇద్దరు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి వీరిద్దరూ చర్చల్లో నిలిచారు..
Samantha Diwali Celebration
సమంత ఒకప్పుడు వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతూ ఉండింది.. కానీ ఆరోగ్య సమస్యల వల్ల ఆమె సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చింది. అయితే ఇప్పటికీ కూడా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
Samantha Raj Photos
సమంత త్వరలోనే మా ఇంటి బంగారం అనే సినిమాలో కనిపించనుంది. ఈ సినిమా మినహా ప్రస్తుతం సమంత ఎటువంటి సినిమాలు అంగీకరించలేదు. మరోపక్క నిర్మాతగా మారి శుభం సినిమా తీసిన సమంత.. తన రాబోయే చిత్రం మా ఇంటి బంగారం కూడా.. తనే నిర్మిస్తోంది.
Samantha Raj First Diwali
ఈ క్రమంలో సమంత తరచూ తన పర్సనల్ లైఫ్ ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంది. ముఖ్యంగా దర్శకుడు రాజ్తో ప్రేమలో ఉంది అన్న వార్త ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతున్న.. ఆమె దీనిపైన ఎటువంటి ఇంటర్వ్యూలో కూడా స్పందించలేదు.
Samantha Raj Family
కానీ ఎప్పటికప్పుడు రాజ్ తో తను తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తూనే ఉంది. ఇప్పుడు దీపావళి పండగ కూడా దర్శకుడితో సెలబ్రేట్ చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచింది.
Samantha Deepavali
సమంత షేర్ చేసిన దీపావళి ఫోటోలు రాజ్ పక్కన కూర్చోవడమే కాకుండా.. వెనక అంతా ఫ్యామిలీ కనిపిస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ రాజ్ ఫ్యామిలీయే అయి ఉంటుంది అనేది అందరి వాదన. మొత్తానికి ఇలా రాజ్ ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలను షేర్ చేసింది సమంత.
