Begin typing your search above and press return to search.

అంబరాన్ని అంటిన సమంత ఆనందం.. 250 మంది అనాథ పిల్లలతో

అసలు విషయంలోకి వెళ్తే.. సమంత నటనతోనే కాకుండా తన స్థిరమైన మంచి మనసుతో కూడా ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

By:  Madhu Reddy   |   21 Oct 2025 9:49 AM IST
అంబరాన్ని అంటిన సమంత ఆనందం.. 250 మంది అనాథ పిల్లలతో
X

దేశవ్యాప్తంగా అక్టోబర్ 20వ తేదీన దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు అంగరంగ వైభవంగా దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు తమ ఇంట జరుపుకున్న దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంత కూడా దీపావళి వేడుకలను జరుపుకుంది. అయితే అందరిలాగే తన కుటుంబ సభ్యులతో కాకుండా వారి మధ్య ఈ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది సమంత. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంతను ఇంత ఆనందంగా చూడడం చైతన్య నుంచి విడిపోయిన తర్వాత ఇదే మొదటిసారి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..





అసలు విషయంలోకి వెళ్తే.. సమంత నటనతోనే కాకుండా తన స్థిరమైన మంచి మనసుతో కూడా ఎప్పటికప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఒకవైపు సినిమాలు, యాడ్స్ ద్వారా సంపాదించిన డబ్బులో కొంత భాగాన్ని ఎన్జీవో సంస్థలకు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 2014లో "ప్రత్యూష సపోర్ట్" అనే ఒక ఎన్జీవోను స్థాపించింది. దీని ద్వారా నిరుపేద మహిళలు, పిల్లలకు వైద్యం, భావోద్వేగ మద్దతును కల్పిస్తోంది. అయితే ఇప్పుడు ఈ దీపావళికి "ప్రత్యూష సపోర్ట్" తన వార్షిక లైట్ ఆఫ్ జాయ్ కార్యక్రమాన్ని హైదరాబాదులో ఘనంగా నిర్వహించింది.





ఈ వేడుకలో వివిధ అనాధాశ్రమాలు, ఎన్జీవోల నుండి సుమారుగా 250 మందికి పైగా పిల్లలు ఒకే చోట చేరి ఆనందం ఆహ్లాదంతో నిండిన సాయంత్రాన్ని గడిపారు. ఆటలు , పాటలు , సరదా కార్యక్రమాలతో ఈ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటాయి. చీకటి పడుతుండగా వందలాది దీపాలు వెలిగించి.. ఆశ, కొత్త ప్రారంభాలకు స్వాగతం పలికారు. సమంతతో పాటు ప్రత్యూష సపోర్ట్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంజుల అనగని పిల్లలతో సమయం గడుపుతూ.. వారితో సంభాషిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.

ఇకపోతే ఈ ప్రత్యూష సపోర్ట్ ఎన్జీవో సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా అవగాహన డ్రైవ్ లను నిర్వహిస్తోంది. అనాధ గృహాలకు మందులు ,పోషకాహారాన్ని సరఫరా చేస్తోంది. పైగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది పిల్లలకు మద్దతుగా నిలిచింది ఈ సంస్థ. శస్త్ర చికిత్సలకు నిధులు సమకూర్చడం.. నవజాత శిశువులు.. గుండె రోగులకు సహాయం చేయడం.. రుతుక్రమ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది.

సమంత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల శుభం సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని తన కొత్త నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే మా ఇంటి బంగారం చిత్రంతో పాటు రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇకపోతే మా ఇంటి బంగారం సినిమాను తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉండడం గమనార్హం.