సామ్ ఈజ్ బ్యాక్.. ఈసారి 80s లుక్‌లో!
స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ కెమెరా ముందుకొచ్చేశారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంతకాలం లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్, ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో సెట్స్‌పై అడుగుపెట్టారు
By: M Prashanth | 26 Oct 2025 2:11 PM ISTస్టార్ హీరోయిన్ సమంత మళ్లీ కెమెరా ముందుకొచ్చేశారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా కొంతకాలం లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్, ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో సెట్స్‌పై అడుగుపెట్టారు. తన ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సోలో పర్ఫార్మెన్స్ కోసం ఆమె రెడీ అయిపోయారు. 'ఖుషి' తర్వాత సమంతను మళ్లీ బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వెయిటింగ్‌కు తెరపడింది.
నిజానికి 'యశోద' (2022) తర్వాత సమంత నుంచి ఆ రేంజ్ పవర్ ప్యాక్డ్ సోలో పెర్ఫార్మెన్స్ రాలేదు. మధ్యలో 'శాకుంతలం', 'ఖుషి' చేసినా.. ఈ ఏడాది 'శుభం'లో కేవలం గెస్ట్ రోల్‌కే పరిమితం అయ్యారు. దీంతో, ఆమె ఫుల్ లెంగ్త్ సోలో హీరోయిన్‌గా ఎప్పుడు వస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ గ్యాప్‌ను ఫిల్ చేస్తూ, సామ్ ఇప్పుడు ఏకంగా డబుల్ డ్యూటీతో బరిలోకి దిగారు.
ఈసారి ఆమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కూడా. తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై 'మా ఇంటి బంగారం' అనే సినిమాను ఆమె స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమంత చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే దీనిపై మంచి బజ్ క్రియేట్ అయింది.
లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. సమంతతో పాటు మిగిలిన స్టార్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు 'ఓ బేబీ' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు స్కై లెవల్‌లో ఉన్నాయి.
ఇదొక రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాదట. 1980ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ అని ఇండస్ట్రీ టాక్. ఈ జానర్ నందిని రెడ్డికి, సమంతకు కూడా కొత్తే. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ సినిమాలో సమంత లుక్ ఇంతకు ముందు ఎవరూ చూడని విధంగా, ఆ పీరియడ్‌కు తగ్గట్టు చాలా కొత్తగా ఉండబోతోందని సమాచారం.
ఒకవైపు నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, మరోవైపు నిర్మాతగా బాధ్యతలు తీసుకుని సమంత ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సోలో సినిమాతో సామ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.
