Begin typing your search above and press return to search.

స‌మంత ఊహించ‌ని బౌన్స్ బ్యాక్!

గ‌త‌ మూడు ఏళ్లుగా వ్యక్తిగత సవాళ్లు, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన `మా ఇంటి బంగారం` చిత్రంతో స‌మంత ఊహించని విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

By:  Srikanth Kontham   |   2 July 2026 7:17 PM IST
స‌మంత ఊహించ‌ని బౌన్స్ బ్యాక్!
X

`ఖుషీ` త‌ర్వాత స‌మంత సుదీర్ఘ విరామం తీసుస‌కున్న సంగ‌తి తెలిసిందే. గ‌త‌ మూడు ఏళ్లుగా వ్యక్తిగత సవాళ్లు, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన `మా ఇంటి బంగారం` చిత్రంతో స‌మంత ఊహించని విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ..నటనలో మరింత పరిణతిని ప్రదర్శించి బాక్సాఫీస్ వ‌ద్ద నిజంగానే బంగార‌మైంది. ఈ అద్భుతమైన విజయం సమంత కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందన‌డంలో సందేహం లేదు.

మూడేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇలాంటి భారీ విజయాన్ని అందుకోవడం చిన్న విషయం కాదు. సాధారణంగా గ్లామర్ ప్రపంచంలో ఇంత కాలం విరామం తీసుకుంటే ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ సమంత తనదైన నటనతో, స్క్రిప్ట్ ఎంపికలోని ప్రత్యేకతతో మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. `మా ఇంటి బంగారం` కమర్షియల్ చిత్రం మాత్రమే కాదు. ఒక నటిగా స‌మంత‌ ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసిన సినిమా అని చెప్పొచ్చు. ఈ సక్సెస్ వెనుక దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు పాత్ర చిరస్మరణీయం.

ఒక ర‌చ‌యిత‌గా సినిమాను అద్భుతంగా మలచడమే కాకుండా తన జీవిత భాగస్వామిని మళ్ళీ స‌క్సెస్ లోకి తీసుకురావడానికి ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారు. సమంతపై ప్రేక్షకులకున్న నమ్మకాన్ని, ఆమెలోని ప్రతిభను సరిగ్గా వినియో గించుకుని రాజ్ నిడిమోరు రూపొందించిన స్క్రీన్ ప్లే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. భార్య కావడంతో ఆమె కంఫర్ట్ జోన్‌ను దృష్టిలో ఉంచుకుని సమంత‌ నటనకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ఆయనలోని ప్రొఫెషనలిజానికి నిదర్శనం. సమంతను తిరిగి పాత గ్లోరీలోకి తీసుకురావడానికి రాజ్ నిడిమోరు తన వంతు బాధ్యతను గొప్పగా నిర్వర్తించారు.

స‌మంత‌ మానసిక స్థితిని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం. వారిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన కెమిస్ట్రీ, సెట్స్‌లో ప్రతి సన్నివేశాన్ని పక్కాగా మలచడానికి ఎంతగానో దోహదపడింది. సమంత సక్సెస్ వెనుక ఉన్న సపోర్టివ్ హస్బెండ్ గా రాజ్ నిడిమోరు తన పాత్రను సంపూర్ణంగా పోషించారు. తాజాగా సమంత మళ్ళీ బిజీ స్టార్‌డమ్‌లోకి అడుగుపెట్టారు. `మా ఇంటి బంగారం` విజయం ఒక సినిమాకే పరిమితం కాలేదు. ఇది స‌మంత‌ భవిష్యత్తు ప్రాజెక్టులకు కూడా బూస్ట్‌లా పని చేస్తోంది.

కమర్షియల్ హంగులతో కూడిన ఎమో షనల్ కథలను ప్రేక్షకులు ఎలా ? ఆదరిస్తారో ఈ చిత్రం నిరూపించింది. సమంత క్రమశిక్షణ, రాజ్ నిడిమోరు ర‌చ‌న‌, నందిని రెడ్డి మేకింగ్ మార్గదర్శకత్వం గొప్ప విజ‌యాన్ని అందించాయి. సమంత బౌన్స్‌బ్యాక్ అనేది చాలా మంది నటీమణులకు స్ఫూర్తి. ఒడిదుడుకులు వచ్చినప్పుడు కుంగిపోకుండా సరైన సమయం కోసం వేచి చూడం మళ్ళీ అదే పట్టుదలతో రంగంలోకి దిగితే విజయం ఎంత తీయగా ఉంటుందో? సామ్ నిరూపించారు.