Begin typing your search above and press return to search.

సమంత మునుపటి కన్నా ఇప్పుడు హ్యాపీగా ఉందా?

మా ఇంటి బంగారం మూవీకి ఆయన రైటర్ గా, కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.

By:  M Prashanth   |   17 Jun 2026 8:45 AM IST
సమంత మునుపటి కన్నా ఇప్పుడు హ్యాపీగా ఉందా?
X

స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన యాక్టివ్ నెస్ తో అభిమానుల దృష్టి ఆకర్షిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు, పబ్లిక్ ఈవెంట్స్ కు దూరంగా కనిపించిన ఆమె.. ఇప్పుడు మాత్రం పూర్తి జోష్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం ప్రమోషన్లలో చూపిస్తున్న యాక్టివ్ నెస్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.

సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సమంత ఆ ప్రాజెక్ట్‌ కు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. రీసెంట్ గా ప్రమోషన్లలో భాగంగా ఒక్క రోజులో దాదాపు 40 నుంచి 50 ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆమె కమిట్మెంట్‌ కు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి. ప్రతి ఇంటర్వ్యూలోనూ చాలా సరదాగా మాట్లాడటం, సినిమా విషయాలను అభిమానులతో పంచుకోవడం గమనార్హం.

కొన్ని నెలల క్రితం సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. చికిత్స కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత, విదేశాల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ పరిస్థితుల కారణంగా ఆమె పబ్లిక్ ఈవెంట్లలో చాలా అరుదుగా కనిపించేవారు.

అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. మా ఇంటి బంగారం ప్రమోషన్లలో ఆమె చూపిస్తున్న ఎనర్జీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అభిమానులకు కొత్త హోప్స్ కలిగిస్తోంది. దీంతో కెరీర్ పరంగా సమంత సెకండ్ ఇన్నింగ్స్‌ ను మంచి జోష్ తో స్టార్ట్ చేశారని సినీ ప్రియులు చెబుతున్నారు. అదే సమయంలో ఆమె భర్త రాజ్ నిడిమోరు సపోర్ట్ కోసం కూడా మాట్లాడుకుంటున్నారు.

మా ఇంటి బంగారం మూవీకి ఆయన రైటర్ గా, కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూల్లో తోడుగా ఉంటూ.. సినిమా విషయాలను కూడా పంచుకుంటున్నారు. ప్రమోషన్లలో కూడా ఇద్దరూ కలిసి కనిపిస్తుండటంతో పలువురు అభిమానులు సమంత ప్రస్తుతం మానసికంగా కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.

ఆమె ముఖంలో కనిపిస్తున్న నవ్వు, పనిపట్ల చూపుతున్న డెడికేషన్ మాత్రం అభిమానులకు పాజిటివ్ సిగ్నల్స్ గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్య సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత.. ఇప్పుడు తిరిగి తన వర్క్ లో నిమగ్నమై, వరుస ఈవెంట్ స్ తో బిజీగా ఉండటం ఆమె అభిమానులను సంతోషపరుస్తోంది. అందుకే మునుపటి కంటే ఇప్పుడు సమంత మరింత హ్యాపీగా ఉందా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

దానికి కరెక్ట్ ఆన్సర్ సామ్ మాత్రమే చెప్పగలిగినా.. ప్రస్తుతం ఆమె చూపిస్తున్న యాక్టివ్ నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కెరీర్‌ పై పెడుతున్న ఫోకస్ చూసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు తమ ఫేవరెట్ హీరోయిన్ మళ్లీ తన పాత జోష్‌ ను అందుకుందని భావిస్తున్నారు. అదే నిజమైతే సమంత సెకండ్ ఇన్నింగ్స్ మరింత సక్సెస్ ఫుల్ గా సాగుతుందని ఆమె అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.