వృద్ధాప్యాన్ని ఆపేసే టెక్నిక్ కనిపెట్టిన సమంత
మయోసైటిస్ లాంటి ప్రమాదకర రుగ్మత నుంచి బయటపడి, ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు సమంత రూత్ ప్రభు.
By: Sivaji Kontham | 28 Aug 2025 9:36 PM ISTమయోసైటిస్ లాంటి ప్రమాదకర రుగ్మత నుంచి బయటపడి, ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు సమంత రూత్ ప్రభు. ఫిట్నెస్ ఫ్రీక్ అనే పదానికి పర్యాయపదంగా మారారు సామ్. నిరంతరం జిమ్ చేయనిది పొద్దు గడవదు. సమంత ఎప్పుడూ ఏదో ఒక కొత్త వ్యాయామం గురించి పరిచయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త వ్యాయామ విధానాన్ని తన అనుచరుల కోసం పరిచయం చేస్తున్నామని తెలిపారు.
చాలా వయసు సంబంధ సమస్యలకు యోగా, వ్యాయామం, ధ్యానం బెస్ట్ సొల్యూషన్. కానీ ఈ వ్యాయామం చేస్తే వృద్ధాప్యాన్ని దాదాపుగా ఆపేయడం సాధ్యపడుతుందని చెబుతున్నారు సమంత రూత్ ప్రభు. కండరాలతో పాటు మెదడు, ఎముకలకు బలం చేకూర్చే, ఓర్పును ఇచ్చే వ్యాయామ విధానం ఇదని చెబుతున్నారు. దీనితో వృద్ధాప్యాన్ని అధిగమించవచ్చని అన్నారు.
`క్లియర్ క్రియేటిన్` అనే కొత్త వ్యాయామం గురించి సమంత వివరించారు. ఇది తన దినచర్యలో చాలా ముఖ్యమైన భాగంగా మారిందని, బలంగా బరువులు ఎత్తడానికి, వేగంగా కోలుకోవడానికి, రోజంతా మరింత దృష్టి కేంద్రీకరించడానికి ఈ వ్యాయామం సహాయపడిందని సమంత తెలిపారు. త్వరలోనే దీనిని అందరి కోసం ప్రారంభిస్తున్నామని, నిజాయితీగా చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ దీనిని ప్రయత్నించే వరకు వేచి చూడలేనని కూడా సమంత ఎగ్జయిటింగ్ గా చెప్పారు.
ఇంతకుముందు ఓ పోస్ట్ లో సమంత రూత్ ప్రభు తాను స్వీకరించే సప్లిమెంట్ల జాబితా గురించి కూడా చెప్పుకొచ్చారు. విటమిన్ D3 + K2 - ఎముక ఆరోగ్యం, కాల్షియం వినియోగం, గుండె నాళాలకు మద్ధతునిస్తుంది.
* ఒమేగా-3 (ఇపిఎ& డిహెచ్ఏ) - మెదడు, గుండె- కీళ్ల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ఉపకరిస్తుంది.
* ఆల్గేకాల్ - ఎముక సాంద్రత కోసం కాల్షియం అందిస్తుంది.. ఇది మొక్కల ఆధారితంగా లభిస్తుంది.
* బోరాన్ - ఖనిజ జీవక్రియకు సహాయపడే, హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇచ్చే ట్రేస్ ఖనిజం.
* జింక్ - రోగనిరోధక పనితీరు, కణజాల మరమ్మత్తు, మొత్తం జీవక్రియ ఆరోగ్యానికి సహకరిస్తుంది.
* కొలొస్ట్రమ్ - గట్ సమగ్రత, రోగనిరోధక స్థితిస్థాపకతకు మద్దతునిస్తుంది.
సమంత రూత్ ప్రభు తాను వీటిని కొవ్వులతో తీసుకుంటానని తెలిపారు. సాధారణంగా అల్పాహారం లేదా భోజనం తర్వాత జీర్ణించుకోవడానికి ముఖ్యంగా విటమిన్లు D3, K2, ఒమేగా-3లు వంటి వాటిని తీసుకుంటాను అని తెలిపారు. ఆహారం, జీవనశైలి, మొత్తం ఆరోగ్య స్థితిని బట్టి సప్లిమెంట్ అవసరాలు వ్యక్తుల మధ్య మారుతాయని వెల్లడించారు.
