సమంత.. ఫేవరెట్ టైమ్ ఏంటో తెలుసా?
తాజాగా తన ఇయర్ లో ఫేవరెట్ టీమ్ ఏంటో చెబుతూ పోస్ట్ చేశారు సమంత. అంతకుముందు ముంబైలోని తన ఇంటి మెయిన్ డోర్ పిక్ ను షేర్ చేశారు.
By: M Prashanth | 27 Nov 2025 5:00 AM ISTస్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫుల్ గా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ ను షేర్ చేస్తుంటారు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంటారు. అవి ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్.. నెట్టింట స్పెషల్ గా ఉండి ఆకట్టుకుంటాయి.
తాజాగా తన ఇయర్ లో ఫేవరెట్ టీమ్ ఏంటో చెబుతూ పోస్ట్ చేశారు సమంత. అంతకుముందు ముంబైలోని తన ఇంటి మెయిన్ డోర్ పిక్ ను షేర్ చేశారు. డోర్ చుట్టూ స్పెషల్ డెకరేషన్ చేసి ఉంది. మరోనెల రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుండగా.. ఇప్పుడే సామ్ ఆ ఫెస్టివల్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తన ఇంటిని డెకరేట్ చేసుకున్నారు.
ఇంటి మెయిన్ డోర్ కు ఓవైపు క్రిస్మస్ ట్రీ పార్ట్ ను అటాచ్ చేయగా.. మరోవైపు స్టైలిష్ "SAM"లోగో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సంవత్సరం ఇలా అన్నట్లు క్యాప్షన్ ఇవ్వగా.. మరో పిక్ లో ఇంట్లో క్రిస్మస్ థీమ్ డెకరేషన్ చేసుకున్న పిక్ పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు అదే తన ఫేవరెట్ టైమ్ అంటూ రాసుకొచ్చారు సమంత.
ప్రస్తుతం సమంత ఇన్ స్టా స్టోరీస్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో డెకరేషన్ అదిరిపోయిందని సామ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అంటూ విషెస్ చెబుతున్నారు. ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోండని అంటున్నారు.
అయితే సమంత.. పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలతో కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె సన్నిహితంగా ఉన్నారని, వారిద్దరూ డేటింగ్ లో ఉంటున్నారని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడా సమంత రెస్పాండ్ అవ్వలేదు.
కానీ రాజ్ నిడిమోరుతో కలిసి పార్టీలకు, సినిమా ఈవెంట్స్ కు సామ్ వెళ్లడంతో రిలేషన్ షిప్ రూమర్లకు మరింత బలం చేకూరుతుంది. వారిద్దరూ ఎక్కడ కనిపించినా అక్కడికి సంబంధించిన వీడియోలు, దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా దీపావళి పండుగ ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. మరి రిలేషన్ షిప్ రూమర్స్ లో నిజమెంతో వారికే తెలియాలి.
