సమంత ఒంటిని చుట్టేసిన స్నేక్
టాలీవుడ్ టు బాలీవుడ్ తన పాపులారిటీ ఏమాత్రం తగ్గకుండా మెయింటెయిన్ చేస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానుల్లో చర్చగా మారింది. సామ్ ఇప్పుడు పూర్తిగా జీరో సైజ్ కి షిఫ్టయ్యాక ఈ ఫోటోషూట్ మరింత స్పెషల్ గా మారింది.
By: Sivaji Kontham | 2 Oct 2025 7:18 PM ISTస్నేక్ ఆర్ట్ అనేది అద్భుతమైన కళ. మెడలో హారం, చేతికి ధరించే గాజులు, వేలికి ఉంగరం, చెవులకు జూకాలు .. ప్రతిదీ నాగు పామును తలపిస్తే.. అది చూపరులను అమితంగా ఆకర్షించకుండా ఉంటుందా? అందుకే అలాంటి ఫ్యాషన్ సెన్స్ కి కేరాఫ్ గా డిజైన్ చేసిన ఆభరణాలు ఇప్పుడు చర్చగా మారాయి.
ఇవి ప్రఖ్యాత బల్గారీ డిజైన్స్. వీటిని ధరించి ప్రమోట్ చేస్తున్నది ఎవరో తెలుసా? అందాల సమంత రూత్ ప్రభు. టాలీవుడ్ టు బాలీవుడ్ తన పాపులారిటీ ఏమాత్రం తగ్గకుండా మెయింటెయిన్ చేస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానుల్లో చర్చగా మారింది. సామ్ ఇప్పుడు పూర్తిగా జీరో సైజ్ కి షిఫ్టయ్యాక ఈ ఫోటోషూట్ మరింత స్పెషల్ గా మారింది.
బల్గారీ షూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసిన సమంత దీనికి ఆసక్తికరమైన క్యాప్షన్ ని కూడా ఇచ్చింది. ఇది నిజంగా గుర్తుంచుకోదగ్గ సాయంత్రం ...కళ, చరిత్ర .. నేను ఇప్పటివరకు చూసిన అత్యంత ఉత్కంఠభరితమైన రత్నాల షైనింగ్‌లో మిక్స్ అయింది. Bvlgari మంత్రముగ్ధులను చేసే సర్పంటి ఇన్ఫింటో షోను ముంబైకి తీసుకు రావడం ఆసక్తికరం అంటూ స్నేక్ అండ్ షూన్ ఈమోజీలను సమంత షేర్ చేసారు.
సమంత మెడలో డిజైనర్ స్నేక్ ఆభరణం.. ఆ చెవులకు రింగు, చేతులకు గాజులు, వేలికి ఉంగరం అన్నీ బల్గారీ బ్రాండ్ స్నేక్ ఆర్ట్ బంగారు ఆభరణాలు. అయితే ఆ నడుముకు వడ్డానం మిస్సయిందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఎంపిక చేసుకున్న ఆభరణాలకు తగ్గట్టుగానే డిజైనర్ బ్లాక్ రివీలింగ్ డ్రెస్ తో మతులు చెడగొట్టింది సామ్. ఈ అందాల భామ సిటాడెల్ - హనీ బన్నీ తర్వాత రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కానీ తదుపరి సినిమా గురించిన సరైన సమాచారం రాలేదు.
