Begin typing your search above and press return to search.

యాక్టింగ్‌తో పాటు ఇన్వెస్టింగ్.. సమంత స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మన ముందుకు వస్తున్నారు.

By:  Madhu Reddy   |   15 Jun 2026 4:30 PM IST
యాక్టింగ్‌తో పాటు ఇన్వెస్టింగ్.. సమంత స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ వైరల్!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది. అయితే ఈసారి ఆమె కేవలం హీరోయిన్‌గానే కాకుండా, నిర్మాతగా కూడా మారారు. సినిమా ప్రమోషన్లలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ విశేషాలు చూద్దాం.

ప్రతి పనినీ మొదటి నుంచీ నేర్చుకున్నా:

ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, తనకు మొదట్లో వ్యాపారం గురించి అస్సలు ఏమీ తెలియదని ఓపెన్‌గా ఒప్పుకున్నారు. కెరీర్‌లో బ్రేక్ తీసుకున్న సమయంలో నెమ్మదిగా బిజినెస్ మెళకువలు నేర్చుకున్నానని చెప్పారు. ఇక ఆ నమ్మకంతోనే పరిశ్రమకు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 10 రకాల విభిన్న వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టినట్లు సమంత వెల్లడించారు. నటనతో పాటు ఇన్వెస్టింగ్ రంగంలో కూడా ఆమె రాణిస్తుండటం విశేషం.

నమ్మకం లేని బ్రాండ్లను ప్రచారం చేయను:

ఒకప్పుడు ఏ బ్రాండ్ పడితే దానికి ప్రచారం చేసినా, ఇప్పుడు మాత్రం తన ఆలోచన మార్చుకున్నానని సమంత స్పష్టం చేశారు. తనకు నమ్మకం లేని వి తాను వాడని బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం మానేశానని చెప్పారు. ఇక డబ్బుల కంటే నమ్మకానికే ఎక్కువ విలువ ఇస్తానని, బ్రాండ్ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని ఆమె క్లారిటీ ఇచ్చారు.

మాటలు చెప్పడం కాదు.. డబ్బులు పెట్టాలి:

సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ స్థాపించడం వెనుక ఉన్న అసలు కారణాన్ని బయటపెట్టారు. మహిళా ప్రధాన కథలు బాగుంటాయని, వారికి అవకాశాలు రావాలని మాటల్లో చెప్పడం మాత్రమే కాదు.. దానికి అనుగుణంగా నా సొంత డబ్బుని కూడా పెట్టుబడిగా పెట్టాలి. ఇక అందుకే నిర్మాతగా మారి ఈ అడుగు వేశాను" అంటూ సమంత స్టేట్‌మెంట్ ఇచ్చారు.

భర్త రాజ్‌తో కలిసి నిర్మాణ రంగంలోకి:

సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక తానే స్వయంగా డబ్బులు పెట్టి, తనకు నచ్చిన కథతో వస్తున్న సినిమా కావడంతో సమంత ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

చివరగా చెప్పాలంటే, సమంత కేవలం గ్లామర్ క్వీన్ మాత్రమే కాదు, బలమైన ఆలోచనలు ఉన్న ఒక పక్కా బిజినెస్ ఉమన్ అని నిరూపించుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలను సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో ఎందరికో స్ఫూర్తినిస్తోంది. మరి యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సమంత చేసిన ఈ సరికొత్త ప్రయత్నం ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.