సమంత అటో.. ఇటో...!
సమంత గతంలో మాదిరిగా రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆమెతో కలిసి నటించే హీరో ఎవరు అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
By: Ramesh Palla | 29 April 2026 12:42 PM IST'ఖుషి' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సమంత 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మధ్యలో వెబ్ సిరీస్‌తో, ఒకటి రెండు సినిమాలో గెస్ట్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆమె అభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు మా ఇంటి బంగారం సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఇప్పటికే విడులైన పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమాను సాధ్యం అయినంత వరకు ఎక్కువగా ప్రమోట్ చేసేందుకు సమంత ప్రయత్నాలు చేస్తుంది. సమంత చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో బజ్ విపరీతంగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్‌లో ఉన్న ఆసక్తి, రెగ్యులర్ ప్రేక్షకుల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న కారణంగా మా ఇంటి బంగారం సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారు అనేది చూడాలి.
మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్‌లో...
మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్‌లో భాగంగా అభిమానులతో సమంత చిట్ చాట్ చేసింది. ఆ సమయంలో చాలా విషయాలపై స్పందించింది. అయితే ఆమె తదుపరి తెలుగు సినిమా ఏంటి అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అంతే కాకుండా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సినిమాలు చేయబోతుందా అనే విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదు. దాంతో సమంత తదుపరి కెరీర్ ఏంటి అనే విషయమై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ మధ్య కాలంలో సమంత కొత్తగా వైవాహిక జీవితం ను మొదలు పెట్టింది. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లుగా చెప్పిన సమంత అనారోగ్య సమస్యలను సైతం ఎదుర్కొంది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా మారింది. అంతే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆమె కొత్త జీవితం మొదలు పెట్టడంతో కెరీర్ పరంగా స్పీడ్ అందుకునే అవకాశాలు ఉన్నాయని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సమంత తర్వాత సినిమాల విషయం...
సమంత గతంలో మాదిరిగా రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు చేసేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆమెతో కలిసి నటించే హీరో ఎవరు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. సీనియర్ హీరోయిన్స్ ను స్టార్ హీరోలు పక్కన పెడుతున్నారు. కొత్త వారితో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. కనుక సమంత హీరోలకు జోడీగా నటించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే బాలీవుడ్‌లో మాత్రం ప్రయత్నాలు చేస్తే స్టార్ హీరోలకు జోడీగా సమంత నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు. కానీ సమంత బాలీవుడ్‌కి వెళ్తుందా లేదంటే టాలీవుడ్‌లోనే ప్రయత్నాలు కొనసాగిస్తుందా అనేది చూడాలి. టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు జోడీగా, కమర్షియల్ పాత్రల్లో నటించే అవకాశం రాకుంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే సమంత మా ఇంటి బంగారం సినిమా తర్వాత ఏం చేయబోతుందా అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో మొదలైంది.
బాలీవుడ్‌లో వరుస సినిమాలకు సమంత...
సౌత్‌లో పెళ్లి అయిన హీరోయిన్స్‌కి గతంలో ఆఫర్లు ఉండేవి కావు. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్నారు. నయనతార పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. కాజల్ సైతం హీరోయిన్‌గా కెరీర్‌ను పెళ్లి తర్వాత కూడా కొనసాగించడం మనం చూస్తున్నాం. అందుకే సమంత టాలీవుడ్, కోలీవుడ్‌లో కమర్షియల్ హీరోయిన్‌గా కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. స్టార్ హీరోలకు జోడీగా సమంతను మరోసారి చూడాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆమె బాలీవుడ్‌కి వెళ్తుందా..? సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. సమంత ఎక్కడ సినిమాలు చేసినా ఆమెను అభిమానించే వారికి సంతోషమే. అయితే సౌత్‌లో సినిమాలు చేస్తే ఎక్కువ మంది ఫ్యాన్స్ సంతృప్తి వ్యక్తం చేస్తారు. మరి ఆమె నిర్ణయం ఏంటి? ఆమె కెరీర్ జర్నీ ఎలా సాగబోతుంది? అనేది కాలమే నిర్ణయించాలి.
