Begin typing your search above and press return to search.

మొత్తానికి స‌మంత‌కు ఆ ఛాన్స్ స‌మీపిస్తోందా?

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసిన సమంత బాలీవుడ్ వెండితెర ఎంట్రీ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Srikanth Kontham   |   19 March 2026 7:00 AM IST
మొత్తానికి స‌మంత‌కు ఆ ఛాన్స్ స‌మీపిస్తోందా?
X

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసిన సమంత బాలీవుడ్ వెండితెర ఎంట్రీ కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్: హనీ బన్నీ వంటి వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సత్తా చాటినా? అది బుల్లి తెర కావ‌డంతో? అమ్మ‌డు సంతృప్తి చెంద‌లేదు . ఒక భారీ హిందీ సినిమా ద్వారా థియేటర్లలో ప్రేక్షకులను పలకరించాలనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా? స‌రైన ఛాన్సులు రాక‌పోవ‌డంతో నీరిక్ష‌ణ త‌ప్ప‌లేదు. తాజాగా సామ్ వెండి తెర ఎంట్రీకి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందున్న కొత్త సినిమాలో సమంతను హీరోయిన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, మిస్టర్ అండ్ మిసెస్ మాహి వంటి చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న శరణ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. కరణ్ జోహార్‌కు సమంతతో ఉన్న స్నేహాం కార‌ణంగా ఈ ఛాన్స్ ద‌క్కుతున్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. మ‌రికొన్ని రోజుల్లోనే ఛాన్స్ ఫైన‌ల్ కానుంద‌ని స‌మాచారం. అదే నిజ‌మైతే స‌మంత ఆనందానికి అవ‌ధులుండ‌వ్. సమంత హిందీ సినిమాల్లో నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తోంది. మధ్యలో అనారోగ్య సమస్యలు , వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు విరామం తీసుకున్నప్పటికీ, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ఇటీవ‌లే బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకోవ‌డం అమ్మ‌డికి కెరీర్ ప‌రంగానూ కొంత క‌లిసొచ్చింద‌ని చెప్పొచ్చు. భ‌ర్త వైపు నుంచి కూడా కొత్త అవ‌కాశాలు రావ‌డానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే ముంబైలో ఖరీదైన ఇంటిని కూడా కొనుగోలు చేసిన సమంత మకాంను పూర్తిగా బాలీవుడ్‌కు మార్చే సింది. సిద్ధార్థ్ మల్హోత్రా వంటి హ్యాండ్సమ్ హీరో సరసన ఆమె జోడీ కడితే బాలీవుడ్‌లో ఒక ఫ్రెష్ అండ్ క్రేజీ కాంబినేషన్ అవుతుంద నడంలో ఎలాంటి సందేహం లేదు.

శరణ్ శర్మ చిత్రాలు భావోద్వేగాలతో కూడిన కథాంశంతో ఉంటాయి. దీంతో సమంత లాంచింగ్ ఇదే ప‌ర్పెక్ట్ స్టోరీ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే హిందీ భాషపై అమ్మ‌డు పట్టు సాధించింది. అక్కడి ప్రేక్షకు లకు నటనతో మ‌రింత‌ దగ్గరవ్వాలని ఆశ‌ప‌డుతోంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి పెద్ద బ్యానర్ లో లాంచ్ అయితే? వ‌చ్చే గుర్తింపు కూడా ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది. హ‌బ్బీ రాజ్ నిడిమోరు స‌హ‌కారం కూడా అన్ని ర‌కాలుగా ద‌క్కుతుంది. ఇక‌పై భ‌ర్త ద‌ర్శ‌క‌త్వంలో కూడా సినిమాలు చేయ‌డానికి ఛాన్స్ ఉంటుంది. బాలీవుడ్ లో రాజ్ కున్న ప‌రిచ‌యాల‌తో మ‌రిన్ని అవ‌కాశాల‌కు ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి స‌మంత బాలీవుడ్ ఎంట్రీ ఆల‌స్య‌మైనా? స్ట్రాంగ్ గానే క‌నిపిస్తుంద‌ని చెప్పొచ్చు.