Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్.. సామ్ క్రేజీ లుక్ చూశారా?

స్టార్ హీరోయిన్ సమంత గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   1 Aug 2025 7:35 PM IST
బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్.. సామ్ క్రేజీ లుక్ చూశారా?
X

స్టార్ హీరోయిన్ సమంత గురించి నిత్యం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అమ్మడు.. తరచూ తన లైఫ్‌కు సంబంధించిన అప్డేట్లు షేర్ చేసుకుంటూ ఉంటారు. తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు. కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తూ సామ్ సందడి వేరే లెవెల్ అనే చెప్పాలి.

అదే సమయంలో ఆమె ఎక్కడ కనిపించినా.. అందుకు సంబంధించిన వీడియోస్ ఎప్పుడూ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతుంటాయి. ఫ్యాన్స్ ను ఆకర్షిస్తూ అలరిస్తుంటాయి. ఇప్పుడు మరో వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ముంబైలోని బాంద్రా ఏరియాలో సామ్ కనిపించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

చేతిలో కాపర్ బాటిల్, ఒక ఫైల్ తో హడావుడిగా కనిపించారు సామ్. ఆ తర్వాత వెంటనే కారు ఎక్కి వెళ్లిపోయారు. ఆ సమయంలో బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో ఉన్న సమంత.. హెయిర్ లీవ్ చేసి క్రేజీ లుక్ లో ఉన్నారు. దీంతో మేడమ్ సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కిర్రాక్ లుక్ సామ్ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

వింటేజ్ సామ్ ఈజ్ బ్యాక్ అంటూ కొందరు అభిమానులు సందడి చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు సమంత.. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నిర్మాతగా డెబ్యూ మూవీ శుభంతో సందడి చేశారు. ఫస్ట్ మూవీతో పాస్ అయిన ఆమె.. సినిమాలో క్యామియో రోల్ లో కనిపించి మెప్పించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇప్పుడు మా ఇంటి బంగారం మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఆ సినిమాను ఆమెనే నిర్మిస్తున్నారు కూడా. తన సొంత బ్యానర్ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై రూపొందిస్తున్నారు సామ్. ఈ ఏడాది సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

దాంతోపాటు హిందీలో రక్త్‌ బ్రహ్మాండ్‌ అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించనున్నారు. అందులో మహారాణిగా సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఆ సిరీస్ స్ట్రీమింగ్ కు రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అప్డేట్స్ రానున్నాయని సమాచారం. మరి అప్ కమింగ్ ప్రాజెక్టులతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.