Begin typing your search above and press return to search.

రెండో పెళ్లి తర్వాత కొత్త ప్లాన్స్ వేసుకున్న సమంత..!

తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   18 Dec 2025 10:13 AM IST
రెండో పెళ్లి తర్వాత కొత్త ప్లాన్స్ వేసుకున్న సమంత..!
X

గత కొద్ది సంవత్సరాలుగా సమంత ఆరోగ్య పరంగా.. పర్సనల్ లైఫ్ పరంగా సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మరో పక్క దర్శకుడు రాజ్‌తో ప్రేమలో ఉన్నట్టు ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక వాటన్నిటికీ నిజం చేస్తూ.. సమంత ఈ నెల మొదట్లో అతన్ని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో పెళ్లి తర్వాత.. సమంత రూత్ ప్రభు 2026 సంవత్సరాన్ని కొత్త ఆలోచనలతో.. ప్రశాంతమైన మనసుతో ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు అని తెలుస్తోంది.




తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్‌లో ఆమె 2026కి పెట్టుకున్న లక్ష్యాలు చాలా సింపుల్‌గా.. మోటివేషనల్‌గా.. ఉండటంతో.. చాలామందికి ప్రేరణగా మారాయి.

పెళ్లయిన తర్వాత సమంత జీవితాన్ని కొంచెం నెమ్మదిగా.. ఆలోచించి జీవించాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు విజయాల వెంట పరుగులు తీయడం కంటే.. తనకు నిజంగా అవసరమైన విషయాలపై దృష్టి పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. 2026 కోసం ఆమె పెట్టుకున్న లక్ష్యాలు ఏమిటంటే.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటం.. రోజూ వ్యాయామం చేయడం.. పక్కన వారితో కృతజ్ఞతతో జీవించడం.. మంచి సంబంధాలు పెట్టుకోవడం.. సమాజానికి ఏదో ఒక రూపంలో తిరిగి ఇవ్వడం.. తన అంతర్గత భావనను నమ్మడం.. స్థిరమైన పని.. స్థిరమైన అభివృద్ధి పొందడం. ఇవే లక్ష్యాలుగా పేర్కొంది సమంత.

ఈ లక్ష్యాలు చూస్తే.. సమంత కేవలం నటి గానే కాకుండా.. ఒక వ్యక్తిగా కూడా ఎదగాలని కోరుకుంటూ ఉందని అర్థమవుతుంది. పేరు, డబ్బు, హడావుడి కంటే మనశ్శాంతి… సమతుల్యత ముఖ్యమని ఆమె నమ్ముతున్నట్లు ఈ పోస్టులో పక్కా చెబుతోంది. ఈ పోస్ట్‌తో పాటు ఆమె ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న ఒక సాదా ఫోటోను కూడా షేర్ చేశారు. ఆ ఫోటో ఆమె మాటలకు అచ్చంగా సరిపోతుందని.. అభిమానులు కామెంట్లు కూడా పెడుతున్నారు.

ఇక ఈ మధ్యనే కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా ఆమె పెళ్లి జరిగింది. తర్వాత సోషల్ మీడియాలో కేవలం తేదీతో పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. పెళ్లి తర్వాత ముంబైలో.. మొదటిసారి ఈ జంట.. ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ థాంక్స్ చెప్పిన.. ఫోటోలు వైరల్ అయ్యాయి. సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది.