ఆడవాళ్లు రిస్క్ తీసుకోవాల్సిందే!
కెరీర్ గురించి మాట్లాడిన ప్రతీ సారీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 12 Sept 2025 2:58 PM ISTకెరీర్ గురించి మాట్లాడిన ప్రతీ సారీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తూ ఉంటారు. సినీ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ ఆ వీడియోలో పలు ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రస్తావించారు. సమంత తన కెరీర్లో ఎన్నో సక్సెస్‌లు, ఫెయిల్యూర్లు, కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలిచారు.
స్టార్‌డమ్ పర్మినెంట్ కాదు
అయితే తాజాగా సమంత షేర్ చేసిన వీడియోలో తన కెరీర్లో కొత్త ఛాప్టర్ మొదలైందని, ఆ జర్నీ ద్వారా ఇతరులకు స్పూర్తిని ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. స్టార్‌డమ్ అనేది పర్మినెంట్ కాదని, నటీనటుల లైఫ్ లో నేమ్, ఫేమ్ కొంత కాలం మాత్రమే ఉంటాయని, ఒకానొక దశలో ఆడియన్స్ కొత్త మొఖాలను స్వాగతిస్తూ, కొత్త తరహా కథలపై ఇంట్రెస్ట్ చూపిస్తారన్నారు.
నా సక్సెస్ ఎంతో మందికి ఆదర్శం
ఆ టైమ్ ను గుర్తించి, తమను తామెలా మార్చుకుని, తమ ఎఫెక్ట్ ను సమాజంపై ఎలా చూపిస్తారనేదే అసలైన సక్సెస్ అని సమంత చెప్పారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల జర్నీ ఎక్కువ కాలం ఉండదని, అవకాశాలు కూడా చాలా తక్కువగానే వస్తాయని చెప్పిన మాట ఆమె సొంత అనుభవంతో చెప్పినదే. అయినప్పటికీ, తాను అందుకున్న సక్సెస్‌లు ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తాయని సమంత చెప్పారు.
అలాంటి వాళ్లే సక్సెస్ అవుతారు
స్టార్ గా ఉన్నప్పుడు కొందరికి స్పూర్తిగా ఉండటం, కనీసం ఒకరికి అయినా మార్గదర్శకురాలిగా ఉండగలగడం నిజమైన సంతృప్తినిస్తుందని సమంత పేర్కొన్నారు. ప్రతీ మహిళా ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని, ఏ విషయంలోనైనా ఎలాంటి భయం లేకుండా రిస్క్ తీసుకునే మహిళలే సక్సెస్ అవుతారని తాను కచ్ఛితంగా చెప్పగలనని అంటున్నారు సమంత.
దూరదృష్టి, కెరీర్ పై ప్లానింగ్ ఉన్న ప్రతీ మహిళా బయటకు వచ్చి తన ఆలోచనలను షేర్ చేసుకోవాలని, ప్రస్తుత ప్రపంచం వారి లీడర్‌షిప్‌నే కోరుకుంటుందని సమంత చెప్పారు. ఓ వైపు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించిన సమంత, మొదటి సినిమాగా శుభం ను నిర్మించి మంచి హిట్ ను అందుకున్నారు.
