Begin typing your search above and press return to search.

రాముడి పాత్రలో సల్మాన్ ఖాన్.. చివరికి అలాంటి అవమానం!

ప్రస్తుతం విడుదలైన రామాయణంపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను రాముడిగా, సోదరుడు సోహైల్ లక్ష్మణుడిగా నటిస్తూ రామాయణం సినిమా తీయాలనుకున్నామని వెల్లడించారు. అయితే రాముడు, లక్ష్మణుడి పాత్రలపై చేసిన సరదా ప్రచారం తమకు నచ్చక ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు. తాజా సినిమాను బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో మాత్రమే అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   9 Nov 2026 3:56 PM IST
రాముడి పాత్రలో సల్మాన్ ఖాన్.. చివరికి అలాంటి అవమానం!
X

ప్రస్తుతం రామాయణం సినిమా మొదటి భాగం విడుదలై పర్వాలేదు అనిపించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఈ రామాయణం సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో పాటు గతంలో సల్మాన్ తను చేయాలనుకున్న రామాయణం గురించి చెప్పిన కొన్ని మాటలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అసలు విషయానికి వస్తే..గతంలో భారత్ సినిమా ప్రమోషన్ల సమయంలో ఓ విలేకరి సల్మాన్ ఖాన్‌ను ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. ఒకవేళ రామాయణం సినిమాలో రాముడి పాత్ర చేసే అవకాశం వస్తే నటిస్తారా అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ.. సల్మాన్ తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి తెలిపారు.

సుమారు 25 ఏళ్ల క్రితం తాను, తన సోదరుడు సోహైల్ ఖాన్ కలిసి రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్‌ను ఎంతో ఆసక్తిగా చూసేవారట. ఆ సీరియల్ వారిపై బాగా ప్రభావం చూపించడంతో ఇద్దరూ కలిసి రామాయణం కథతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నారట. ఈ ప్రాజెక్టులో సల్మాన్ రాముడిగా, సోహైల్ లక్ష్మణుడిగా నటించాలని అనుకున్నారట. అందుకు సంబంధించిన ఆలోచనలు కూడా అప్పట్లో మొదలయ్యాయని సల్మాన్ తెలియజేశారు.

అయితే ఈ సినిమా గురించి బయటకు తెలిసిన తర్వాత ఓ అనుకోని సంఘటన చోటుచేసుకుందట. ఒకరోజు స్టూడియో నుంచి ఇద్దరూ బయటకు వస్తుండగా కొందరు వ్యక్తులు వారిని ఫొటోలు తీశారు. ఆ తర్వాత ఆ ఫొటోలకు రాముడు, లక్ష్మణుడి కిరీటాలను జోడించి సరదాగా ప్రచారం చేశారట. ఈ వ్యవహారం తమకు అస్సలు నచ్చలేదని సల్మాన్ తెలిపారు. రామాయణం వంటి గొప్ప ఇతిహాసంలోని పాత్రలను గౌరవంగా చూడాల్సిన సమయంలో వాటిపై హాస్యం చేయడం బాధ కలిగించిందని చెప్పారు. దీంతో ఆ సినిమా ఆలోచనను అక్కడితోనే పక్కన పెట్టినట్లు వివరించారు. ఇక ప్రస్తుతం సల్మాన్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే..ప్రస్తుతం వచ్చిన రామాయణం సినిమా గురించి కూడా సల్మాన్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు రూ.4,000 కోట్ల బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ గురించే ఎక్కువగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదని అన్నారు.

నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన తాజా రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించారు.