Begin typing your search above and press return to search.

'జో డర్ గయా వో మర్ గయా'... ట్రోల్స్‌కు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్?

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన సమయంలో, విద్యా సంస్కరణల ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు సల్మాన్ ఖాన్ బహిరంగంగా స్పందించారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 July 2026 12:28 PM IST
జో డర్ గయా వో మర్ గయా... ట్రోల్స్‌కు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్ కౌంటర్?
X

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. రీసెంట్ గా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వివాదంపై ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీయగా, వాటిపై వచ్చిన విమర్శలకు తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్‌తో మరోసారి వార్తల్లో నిలిచారు. డైరెక్ట్ గా ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా, తనపై వస్తున్న ట్రోలింగ్‌కు సల్మాన్ ఇస్తున్న సమాధానమన‌మిదేన‌ని అభిమానులు, నెటిజన్లు భావిస్తున్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైన సమయంలో, విద్యా సంస్కరణల ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు సల్మాన్ ఖాన్ బహిరంగంగా స్పందించారు. నిరాహార దీక్షను కొనసాగించవద్దని కోరుతూ, సోన‌మ్... ఇట్స్ డన్ బ్రో. ఇక దీన్ని పొడిగించొద్దు. కావాలంటే ఇంటి నుంచి భోజనం పంపిస్తాన‌ని ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, స్టూడెంట్స్ సురక్షితంగా తమ ఇళ్లకు వెళ్లాలని సూచించారు. అయితే ఇట్స్ డ‌న్ బ్రో అనే ఒక్క కామెంట్ వ్యాఖ్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కొందరు సల్మాన్ ఉద్దేశాన్ని సమర్థిస్తూ శాంతియుత పరిష్కారాన్ని కోరారని అభిప్రాయపడగా, మరికొందరు మాత్రం ఆ కామెంట్ సమస్య తీవ్రతను తగ్గించి చూపేలా ఉందంటూ విమర్శించారు. దీంతో ఆ డైలాగ్ మీమ్స్ రూపంలో ట్రెండ్ అయి పెద్ద ఎత్తున డిస్క‌ష‌న్‌కు దారితీసింది.

ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో రెండు జిమ్ ఫొటోలను షేర్ చేశారు. షర్ట్‌లెస్ లుక్‌లో ఫిట్‌నెస్‌ను ప్రదర్శిస్తూ అద్దం ముందు దిగిన ఫొటోలతో పాటు, స‌ల్మాన్ ఖాన్ డ‌ర్ గ‌యా.. హ్మ్.. జో డ‌ర్ గ‌యా వో మ‌ర్ గ‌యా అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌ను నెటిజన్లు ట్రోల్స్‌కు సల్మాన్ ఇచ్చిన గట్టి కౌంటర్‌గా విశ్లేషిస్తున్నారు. తాను భయపడే వ్యక్తిని కాదనే సంకేతాన్ని ఆయన తనదైన శైలిలో ఇచ్చారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా సల్మాన్ హెల్త్, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ అంశంపై మొదట స్టూడెంట్స్‌కు మద్దతు ప్రకటించిన ఆయన, తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకంతో ఆందోళనకారులు ఇంటికి వెళ్లాలని కోరడం కూడా చర్చనీయాంశమైంది. సున్నితమైన సామాజిక అంశాలపై సెల‌బ్రిటీల కామెంట్స్ ఎంత వేగంగా దేశవ్యాప్తంగా డిస్క‌ష‌న్‌కు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఒకే ఒక్క కామెంట్ మీమ్‌గా మారి నేష‌న‌ల్ లెవెల్ డిబేట్‌కు కారణం కావడం, త‌ర్వాత‌ దానికి వచ్చిన రెస్పాన్స్ సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపడం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.