నాకు నేనే ఫేవరెట్ తెలుగు హీరో అవ్వాలనుకున్నా!
తన ఫేవరెట్ తెలుగు హీరో తానే కావాలని అనుకున్నానని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరదాగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ‘మాతృభూమి’ ప్రమోషన్ల సందర్భంగా ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. దర్శకుడు వంశీ పైడిపల్లిని అద్భుతమైన దర్శకుడిగా ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో సల్మాన్ నటిస్తున్నారు.
By: Sivaji Kontham | 20 Nov 2026 11:28 PM ISTనాకు నేనే ఫేవరెట్ తెలుగు హీరో అవ్వాలనుకున్నా! ఈ మాట అన్నది ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. మీ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు? అని జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు భాయిజాన్ సమాధానం నిజంగా ఆశ్చర్యపరిచింది. అతడు మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారని అందరూ అనుకున్నారు. చిరు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, అనుబంధం కారణంగా అలా ఊహించారు. కానీ సల్మాన్ నుంచి పూహించని జవాబు వచ్చింది. సల్మాన్ హైదరాబాద్ టూర్ లో తన సినిమా మాతృభూమిని ప్రమోట్ చేస్తుండగా, స్థానిక జర్నలిస్టుల నుంచి ఈ సరదా సన్నివేశం కనిపించింది.
అయితే సల్మాన్ మైండ్ లో ఏం ఉందో ఈ మాటతో స్పష్ఠంగా అర్థమవుతోంది. రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్లు దక్షిణాది మార్కెట్ ని కొల్లగొట్టి.. అందునా తెలుగు మార్కెట్లో వందల కోట్ల కలెక్షన్లను సాధిస్తుంటే, ఇప్పుడు సల్మాన్ భాయ్ కూడా ఇక్కడ టార్గెట్ చేస్తున్నారని అతడి మాటలే చెబుతున్నాయి,
అలాగే టాలీవుడ్ ట్యాలెంటెడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి ఫెంటాస్టిక్ డైరెక్టర్ అంటూ సల్మాన్ భాయ్ కితాబిచ్చారు. ప్రస్తుతం పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ కథానాయకుడిగా దిల్ రాజు ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు `మాతృభూమి` సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముగించేయగానే, అటుపై తిరిగి పైడిపల్లి సినిమా షూటింగ్ తో బిజీ అవుతారు.
మాతృభూమి చిత్ర కథాంశం ప్రకారం... ఇండియా - చైనా బార్డర్ లోని గల్వాన్ లోయలో జరిగిన ఆయుధ రహిత ముష్ఠి యుద్ధం ఆధారంగా రూపొందించిన ఎమోషనల్ డ్రామా. మైనస్ డిగ్రీల చలిలోను భారతీయ సైనికులు చైనీ సైన్యంపై ఎలా దండెత్తారనే అంశంతో ఈ సినిమాని రూపొందించారు. ప్రచార చిత్రాలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
