సల్మాన్ సూపర్‌హీరో సినిమాలో సౌత్ బ్యూటీ జాక్‌పాట్
ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ రాకముందే బాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి వాడివేడిగా చర్చ జరుగుతోంది.
By: Sivaji Kontham | 10 March 2026 5:00 PM ISTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌత్ డైరెక్టర్ల వైపు మొగ్గు చూపుతున్న సల్మాన్, ఈసారి పాన్ ఇండియా స్థాయిలో భారీ `సూపర్ హీరో` చిత్రాన్ని ప్లాన్ చేశారు. `ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్‌ల సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ రాకముందే బాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ ప్రాజెక్ట్ గురించి వాడివేడిగా చర్చ జరుగుతోంది.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించబోయే కథానాయిక ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రధానంగా సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. టాలెంటెడ్ బ్యూటీ సమంత పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. సమంతే ఈ రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన `ది ఫ్యామిలీ మ్యాన్ 2`, `సిటాడెల్: హనీ బన్నీ` ప్రాజెక్టుల ద్వారా సమంతకు ఆ దర్శకులతో మంచి అనుబంధం ఉండటమే దీనికి ప్రధాన కారణం.
సమంత ఫేవరెట్ కావడానికి మరో బలమైన కారణం ఈ బ్యూటీకి యాక్షన్ పాత్రల్లో ఉన్న పట్టు. ఈ చిత్రం సూపర్ హీరో కథాంశంతో సాగడం వల్ల.. కథానాయిక పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌గా ఉంటుందని సమాచారం. `ఫ్యామిలీ మ్యాన్`లో రాజీగా, `సిటాడెల్`లో గూఢచారిగా సమంత కనబరిచిన పరాక్రమం చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ లాంటి భారీ యాక్షన్ స్టార్ పక్కన సమంత సరిగ్గా సరిపోతుందని దర్శకులు భావిస్తున్నారు.
మరోవైపు నయనతార పేరు కూడా గట్టిగానే పరిశీలనలోకి వచ్చింది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ - ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన `సికందర్` లో నయన్ నటించాల్సి ఉన్నా అప్పుడు కుదరలేదు. అందుకే ఇప్పుడు సల్మాన్ భాయ్ ఆఫర్ ఇవ్వాలని భావించారట. కానీ రాజ్ అండ్ డీకే సమంతను ఫైనల్ చేసారని గుసగుస వినిపిస్తోంది. దర్శకద్వయం మేకింగ్‌కు సమంత మరింత ఈజీగా సెట్ అవుతుందనేది ఇన్ సైడ్ టాక్.
సల్మాన్ ఖాన్ తన ఇమేజ్‌ను పూర్తిస్థాయిలో రీబూట్ చేసే క్రమంలో ఈ సూపర్ హీరో చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండే రాజ్ అండ్ డీకే మేకింగ్ కి సల్మాన్ మాస్ ఇమేజ్ తోడైతే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో సమంత ఫైనల్ అయితే.. సల్మాన్ - సమంత కాంబినేషన్‌లో వచ్చే మొదటి చిత్రంగా ఇది భారీ హైప్‌ను అందుకుంటుంది.
త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సల్మాన్ భాయ్ ఈసారి విదేశీ టెక్నీషియన్లు, సౌత్ టాలెంట్‌ను మిక్స్ చేసి సరికొత్త విజువల్ వండర్‌ను ఆవిష్కరించాలని చూస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్లకే కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సల్మాన్ మొదటిసారి సూపర్ హీరో పాత్రలో ఎలా కనిపిస్తారో.. సమంత అతడికి ఎలాంటి సపోర్ట్ ఇస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
