సూపర్‌స్టార్‌కి సూసైడల్ వ్యాధి.. టిఫిన్ తినాలంటే గంటన్నర!
అకస్మాత్తుగా ముఖ కండరాలు పట్టి గుంజడం, నమిలేసినంతగా బాధకు గురవ్వడం వంటి లక్షణాలను ఆత్మహత్య వ్యాధి అంటారు.
By: Sivaji Kontham | 29 Sept 2025 1:39 AM ISTఅకస్మాత్తుగా ముఖ కండరాలు పట్టి గుంజడం, నమిలేసినంతగా బాధకు గురవ్వడం వంటి లక్షణాలను ఆత్మహత్య వ్యాధి అంటారు. ఈ విషయాన్ని చెప్పినది ఎవరో కాదు కండల హీరో సల్మాన్ ఖాన్. అతడు అరుదైన ట్రైజెమినల్ న్యూరల్జియా (TN) తో ఏడేళ్లుగా బాధను అనుభవిస్తున్నానని తెలిపాడు. ఈ వ్యాధి కారణంగా సరళమైన రోజువారీ పనులు కూడా ఒక పరీక్షగా మారతాయి. ఈ నొప్పి ముఖం నుండి మెదడుకు సంచలనంగా తీసుకువెళ్ళే ట్రైజెమినల్ నాడిని ప్రభావితం చేస్తుంది. ఇటీవల `టూ మచ్ విత్ ట్వంకిల్ అండ్ కాజోల్` టాక్ షోలో సల్మాన్ ఈ వ్యాధి గురించి చెప్పాడు.
2007లో వచ్చిన `పార్టనర్` సినిమా సెట్‌లో సహనటి లారా దత్తా తన ముఖం నుండి ఒక వెంట్రుకను తొలగించినప్పుడు తాను మొదట ఆ సంకేతాలు, లక్షణాలను గమనించానని సల్మాన్ గుర్తు చేసుకున్నారు. సెట్లో అతడు ఆ నొప్పిని అనుభవించాడు... మొదట డెంటల్ సమస్య అనుకున్నాడు. దంత పరీక్ష కోసం వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. కానీ చివరికి అది నరాల సంబంధితమని కనుగొన్నాడు. ఇది అత్యంత భయంకరమైన నొప్పి. దీనిని `ఆత్మహత్య వ్యాధి` అంటారు. ఈ పరిస్థితి కారణంగానే చాలావరకూ ఆత్మహత్యలు చేసుకుంటారు. మన శత్రువుకు కూడా ఆ నొప్పి ఉండాలని కోరుకోలేము. నాకు ఏడున్నర సంవత్సరాలుగా ఈ నొప్పి ఉంది అని తెలిపారు.
ఈ అరుదైన వ్యాధి కారణంగా, ఉదయం అల్పాహారం తీసుకోవాలన్నా కనీసం గంటన్నర సమయం పడుతుందని సల్మాన్ చెప్పాడు. మెత్తగా నమలడానికి సులువుగా ఉండే పదార్థాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని, అతిగా వేడి ఉండేవి లేదా చల్లని పదార్థాలు తినలేనని కూడా వెల్లడించాడు. గట్టిగా నమిలేవి ఏవీ సూట్ కావు. ప్రతి నాలుగైదు నిమిషాలకు ఒకసారి నరం గుంజినట్టు అనిపించిన రోజులున్నాయని తెలిపాడు. దీనికి చికిత్స ఉన్నా కానీ, చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి శుభ్రత చాలా అవసరం.
సల్మాన్ ఖాన్ మురుగదాస్ తో `సికందర్` ఫెయిలయ్యాక దేశభక్తి నేపథ్య కథను ఎంచుకున్నాడు. `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` షూటింగ్‌లో ఉన్నారు. మరోవైపు `బిగ్ బాస్ 19` హోస్ట్‌గాను బిజీగా ఉన్నారు. ఆర్యన్ ఖాన్ షో `ది బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్`లో కూడా అతిధి పాత్ర పోషించాడు. అమీర్ ఖాన్‌తో కలిసి ఇటీవల పాపులర్ టీవీ షోలోను పాల్గొన్నాడు.
