సౌత్ డైరెక్టర్స్‌తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తాడా?
బాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు.
By: Ravindar Gorantla | 17 March 2026 1:00 AM ISTబాలీవుడ్ కండల వీరుడు సల్లూ భాయ్ సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు. షారుక్ ఖాన్ `పఠాన్`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసి `జవాన్`తో మరో బ్లాక్ బస్టర్‌ని దక్కించుకుని ఇప్పుడు `కింగ్`తో మరోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నా సల్మాన్ ఖాన్ రేసులో వెనకబడి పోతున్నాడు. 2019లో వచ్చిన `భారత్` తరువాత సల్మాన్ మళ్లీ ఆ స్థాయి సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోతున్నాడు. దాదాపు ఏడేళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒక దశలో సౌత్ బ్లాక్ బస్టర్ `పోకిరి` రీమేక్ `వాంటెడ్`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసి వరుస సక్సెస్‌లని తన ఖాతాలో వేసుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. అయితే సౌత్ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్‌ని నమ్మి చేసిన `సికిందర్` అట్టర్ ఫ్లాప్ అనిపించుకుని షాక్ ఇచ్చినా కానీ సల్మాన్ సౌత్ డైరెక్టర్‌లతో మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే సౌత్‌లో భారీ క్రేజ్ ఉన్న ప్రొడక్షన్ కంపనీల్లో సౌత్ డైరెక్టర్లతో భారీ సినిమాలకు శ్రీకారం చుట్టబోతున్నాడు.
ఇందులో ఒకటి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి తెరకెక్కిచనున్న భారీ ప్రాజెక్ట్ ఒకటి. రెండవది `ది ఫ్యామిలీ మ్యాన్` సిరీస్‌తో దర్శకులుగా మంచి పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకె ద్వయంతో చేయబోతున్న సూపర్ హీరో మూవీ మరోకటి. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే బయటకు రానుంది. ఇందులో సల్మాన్ ఖాన్‌కు జోడీగా సమంత నటించనుందని ఇన్ సైడ్ టాక్.
ఇక వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రూపొందనున్న ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని, ఇప్పటికే తనతో దిల్ రాజు సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే ఫైనల్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లలో వంశీ పైడిపల్లి రూపొందించనున్న సినిమా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. `వాంటెడ్`తో కష్టకాలంలో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసినట్టే సౌత్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో చేస్తున్న సినిమాలతో సల్మాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
విచిత్రం ఏంటంటే సల్మాన్ ఖాన్ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న `బాటిల్ ఆఫ్ గల్వాన్` స్టోరీ కూడా సౌత్‌కు చెందిన కల్నల్ బి. సంతోష్‌బాబు స్టోరీనే కావడం గమనార్హం. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌పై చైనా విషం కక్కడంతో సల్మాన్ ఈ మూవీ టైటిల్‌ని `మాతృభూమి`గా మార్చేశాడు. దీంతో ఏప్రిల్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
