Begin typing your search above and press return to search.

పదేళ్ల తర్వాత హిట్‌ కాంబో రిపీట్‌ కానుందా...?

ఇండస్ట్రీలో హిట్‌ కాంబోలో మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ముందస్తు బజ్ క్రియేట్‌ కావడం చాలా కామన్ విషయం.

By:  Ramesh Palla   |   13 Aug 2025 12:00 AM IST
పదేళ్ల తర్వాత హిట్‌ కాంబో రిపీట్‌ కానుందా...?
X

ఇండస్ట్రీలో హిట్‌ కాంబోలో మూవీ వస్తుందంటే ఖచ్చితంగా ముందస్తు బజ్ క్రియేట్‌ కావడం చాలా కామన్ విషయం. హీరో, హీరోయిన్‌, హీరో- దర్శకుడు ఇలా చాలా కాంబినేషన్‌లు సాధించిన విజయాల నేపథ్యంలో వారి కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఒక హీరో, హీరోయిన్‌ కలిసి నటించి హిట్‌ అయితే అదే కాంబోలో రెండు మూడు అంతకు మించి సినిమాలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు ఇలాంటి కాంబినేషన్‌లపై ఎక్కువ సినిమాలు వచ్చాయి. బాలీవుడ్‌లో హిట్‌ క్రేజీ కాంబోగా సల్మాన్‌ ఖాన్‌, సూరజ్ బర్జాత్య నిలిచారు. సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన పలు సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలకు వీరి కాంబో పెట్టింది పేరు అన్నట్లుగా నిలిచి బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసే విధంగా విజయాలు నమోదు అయ్యాయి.

సూరజ్‌ బర్జాత్య దర్శకత్వంలో సల్మాన్‌

సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌ పరంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఆ మధ్య సల్లూ భాయ్‌ హీరోగా నటించిన సికిందర్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత సల్మాన్‌ ఖాన్‌ చేయబోతున్న సినిమాలపై ప్రేక్షకుల్లోనూ ఆసక్తి సన్నగిల్లింది. అయినప్పటికీ ఆయనతో సినిమాలకు మేకర్స్ ముందుకు వస్తున్నారు. సల్మాన్‌ మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్‌ హీరోగా తాను ఒక సినిమాను తీయాలి అనుకుంటున్నట్లు దర్శకుడు సూరజ్ బర్జాత్య ప్రకటించాడు. ఆయన ప్రస్తుత జనరేషన్‌కి తగ్గట్లుగా సినిమాలను తీయగలడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మంచి సినిమాలు తీస్తే ఏ జనరేషన్‌ వారు అయినా ఇష్టపడుతారని ఈ మధ్య కొన్ని సినిమాలు నిరూపించాయి.

ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో తర్వాత

సూరజ్ బర్జాత్య దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా చివరగా దాదాపు పదేళ్ల క్రితం ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ సల్మాన్‌ ఖాన్‌ తో మరిన్ని సినిమాలను ఆ సమయంలో దర్శకుడు చేయలేదు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సూరజ్ బర్జాత్య దర్శకత్వం చేయాలని సిద్ధం అయ్యాడు. ఇటీవల ఆయన ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన సమయంలో తన ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ను చెప్పాడు. దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా మరిన్ని యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సినిమాలను ముందు ముందు తీస్తాను అంటూ హామీ ఇచ్చాడు. సల్మాన్‌ ఖాన్‌ తో తీయబోతున్న సినిమా గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు.

మైనే ప్యార్‌ కియా తరహా లవ్‌ స్టోరీ

సల్మాన్‌ ఖాన్‌ వయసుకు తగ్గట్లుగా ఒక న్యూ ఏజ్డ్‌ లవ్‌ స్టోరీని రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. గతంలో సల్మాన్ ఖాన్‌ తో తాను తీసిన సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయని, మంచి ప్రేమ కథ ఉంటుందని ఆయన అంటున్నాడు. గతంలో సల్మాన్‌ ఖాన్‌ తో సూరజ్ బర్జాత్య చేసిన సినిమాలు మైనే ప్యార్‌ కియా, హమ్‌ ఆప్కే కౌన్‌, హమ్‌ సాత్‌ సాత్‌ హై సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ సినిమాల మాదిరిగా ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌తో ఒక మంచి ప్రేమ కథ సినిమాను సూరజ్ బర్జాత్య తీస్తే తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూస్తారు అంటూ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు సూరజ్ బర్జాత్య చేసిన వ్యాఖ్యల గురించి సల్మాన్ ఖాన్‌ స్పందించలేదు. ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.