సల్మాన్‌ఖాన్ జాకెట్ యమ కాస్ట్‌లీ గురూ!
తాజాగా సల్మాన్ ఖాన్ మరో ఖరీదైన స్పెషల్ దానితో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముంబయిలో వెరైటీ ఇండియా మ్యాగజైన్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
By: Tupaki Entertainment Desk | 6 Feb 2026 5:00 AM ISTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ విలసవంతమైన జీవితాన్నే ఆస్వాదిస్తుంటాడన్నది తెలిసిందే. సాధారణంగా తను వాలే బ్రేస్ లెట్, రిస్ట్ వాచ్ ఇలా ప్రతీదీ కాస్ట్‌లీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటాడు. ప్రతీ యాంటిక్ పీస్‌ని పర్చేజ్ చేస్తూ ఐకానిక్ సెలెక్షన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాడు. ముంబయి బాంద్రాలో ఉంటున్న సల్మాన్ ఫ్యాషన్‌కి ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడన్నది తెలిసిందే. హై ఎండ్ వాచ్‌ల నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ల వరకు సల్మాన్ ప్రతీదీ కాస్ట్‌లీగా, పర్‌ఫెక్ట్ యాంటిక్ పీస్‌గా ఉండేలా ప్లాన్ చేస్తుంటాడు.
తాజాగా సల్మాన్ ఖాన్ మరో ఖరీదైన స్పెషల్ దానితో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ముంబయిలో వెరైటీ ఇండియా మ్యాగజైన్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌లో సల్మాన్ తనదైన స్వాగ్, స్టైల్‌తో ఎంట్రీ ఇచ్చి అక్కడున్న వారిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాడు. బ్లాక్ కలర్ టీషర్ట్‌పై ప్రీమియం బ్రియోనీ లెదర్ జాకెట్ ధరించి అత్యంత ఆకర్షనీయంగా కనిపించి ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాడు. అంతే కాకుండా తను ధరించిన జాకెట్‌తో అక్కడ హాట్ టాపిక్ అయ్యాడు.
ఈవెంట్‌కి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్ ధరించి జాకెట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ జాకెట్ ధర అక్షరాలా రూ.62 లక్షలకు పైమాటేనట. అంటే దీని ప్రైజ్ ఒక లగ్జరీ ఎస్‌యూవీ కార్ అంత అన్నమాట. ఇండియాలో టాయోటా ఫార్చునర్ రేట్ రూ.40 లక్షల నుంచి వేరియెంట్‌లని బట్టి టాప్ ఎండ్ వరకు రూ.62 లక్షల వరకు ఉంటుంది. అంటే సల్మాన్ ఖాన్ ధరించి జాకెట్ `టాయోటా ఫార్చునర్`తో సమానం అని తెలియడంతో అంతా అవాక్కవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ఖాన్ ఖరీదైన జాకెట్ ధరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ టీషర్ట్‌పై ప్రీమియం బ్రియోనీ లెదర్ జాకెట్ ధరించి అత్యంత స్టైలిష్‌గా సల్మాన్ ఖాన్ కనిపిస్తుండటం, జాకెట్ ప్రైజ్ వైరల్ కావడంతో అభిమానులు, సినీ లవర్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సల్మాన్ స్టైల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారట. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా సల్మాన్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నా విషయం తెలిసిందే. ప్రస్తుతం దాని నుంచి బయటపడాలని వార్ డ్రామాని ఎంచుకున్నాడు.
సల్మాన్‌ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ వార్ డ్రామా `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్`. అపూర్వలాఖియా దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఇండియా- చైనా సరిహద్దు ప్రాంతమైన గల్వాన్ లోయలో భారత దళాలకు, చైనా లిబరేషన్ ఆర్మీకి మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇటీవలే టీజర్‌ని రిలీజ్ చేయడం తెలిసిందే. చిత్రాంగద సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సల్మాన్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.
