హీరోయిన్ డ్రెస్ నచ్చక షూటింగ్ కి హీరో నో!
సల్మాన్ తనపై ఉన్న కేరింగ్ వల్లనే అలా చేశాడని.. అప్పట్లో ఆయన తన కాస్ట్యూమ్స్ విషయంలో చాలా ప్రొటెక్టివ్‌గా ఉండేవారని కరిష్మా పేర్కొన్నారు.
By: Srikanth Kontham | 15 Oct 2026 11:00 PM ISTబాలీవుడ్ జోడీ సల్మాన్ ఖాన్- కరిష్మా కపూర్ 90వ దశకంలో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో? చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. అయితే తెర వెనుక ఇద్దరి మధ్య మంచి స్నేహంతో పాటు అప్పుడప్పుడు సరదా గొడవలు కూడా జరిగేవట. తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న కరిష్మా కపూర్ ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాన్ని పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
డేవిడ్ ధావన్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్- కరిష్మా కపూర్ జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా `దుల్హన్ హమ్ లే జాయేంగే. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్యాషన్ విషయంలో ఎంతో ఉత్సాహంగా ఉండేదాన్నని కరిష్మా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాలో తాను ధరించిన మోడ్రన్ కాస్ట్యూమ్ చూసి సల్మాన్ ఖాన్ షాక్ అయ్యారని, ఈ గెటప్‌లో అయితే తాను సీన్లో నటించనని మొండికేశారని తెలిపారు.
కరిష్మా ధరించిన దుస్తులు ఓపెన్‌గా .. టైట్‌గా ఉండటంతో సల్మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. `నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుని వస్తే నేను నీతో కలిసి షాట్ ఇవ్వను. వెళ్లి మార్చుకో` అని సల్మాన్ కొపగించుకున్నట్లు కరిష్మా వెల్లడించారు. దీనిపై సల్మాన్ స్పందిస్తూ.. ఆ కాస్ట్యూమ్ చాలా పొట్టిగా .. షీర్గా ఉండటం వల్లే తాను అలా అనాల్సి వచ్చిందని.. టేక్కు ముందు దానిని సరిచేసుకోవాలని తాను కోరినట్లు గుర్తు చేసుకున్నారు.
సల్మాన్ తనపై ఉన్న కేరింగ్ వల్లనే అలా చేశాడని.. అప్పట్లో ఆయన తన కాస్ట్యూమ్స్ విషయంలో చాలా ప్రొటెక్టివ్‌గా ఉండేవారని కరిష్మా పేర్కొన్నారు. సల్మాన్ ఒప్పుకోకపోవడంతో చేసేది లేక నేరుగా దర్శకుడు డేవిడ్ ధావన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలా సెట్స్‌లో తమ మధ్య కాస్ట్యూమ్స్ విషయంలో తరచుగా చిన్నపాటి వాదనలు, సరదా గొడవలు జరిగేవని కరష్మికపూర్ వివరించారు.
90వ దశకంలో `జూడ్వా`, `బీవీ నెం.1`, `అందాజ్ అప్నా అప్నా` వంటి అనేక చిత్రాల్లో నటించి ఈ జోడీ టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆన్-స్క్రీన్‌లో అల్లరి చేస్తూనే.. ఆఫ్-స్క్రీన్‌లో ఇలాంటి మధురమైన, ఫన్నీ జ్ఞాపకాలను పంచుకోవడం తో ఈ స్టార్స్ మరోసారి అభిమానులను అలరిస్తున్నారు. నాటి జ్ఞాపకాలు సోషల్ మీడి యాలో వైరల్ అవుతున్నాయి.
ఆ రకంగా బాలీవుడ్ ఐకానిక్ జోడీగా పేరొందిన సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య తెరవెనుక సరాగాలు, సరదా గొడవలు నాటి సినిమాల్లో వారి కెమిస్ట్రీని మరింత సహజంగా ఆవిష్కరించడానికి దోహదపడ్డాయని చెప్పొచ్చు. సెట్స్‌లో ఎలాంటి గొడవలు జరిగినా? కెమెరా ముందర మాత్రం ఇద్దరు ఒకరినొకరు ఎంతగానో గౌరవించుకుంటూ ఆడియన్స్‌కు మర్చిపోలేని వినోదాన్ని పంచారు.
