స్టార్ హీరో డూప్ కి గొప్ప సహాయం!
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ రియల్ హీరో అని మరోసారి నిరూపించారు .
By: Srikanth Kontham | 25 Aug 2026 1:42 PM ISTబాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ రియల్ హీరో అని మరోసారి నిరూపించారు . సల్మాన్ సినిమాల్లో రిస్క్ సీన్స్ లో అండగా నిలిచే బాడీ డబుల్ పర్వేజ్ కాజీ కష్టకాలంలో ఉంటే అండగా నిలిచారు. ఇటీవల గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న పర్వేజ్ కాజీకి సల్మాన్ ఖాన్ తగిన సహాయం అందించి గొప్ప మనసు చాటుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ సినిమాల్లో ఆయన డూప్‌గా పనిచేస్తూ పర్వేజ్ కాజీ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సల్మాన్ చిత్రాల విజయాల్లో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల పరంగా తెరవెనుక పర్వేజ్ పాత్ర ఎంతో ఉంది.
అయితే అనారోగ్య సమస్యల కారణంగా పర్వేజ్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ వెంటనే స్పందించి వైద్య ఖర్చుల విషయంలో తగిన సహాయం అందించడమే కాకుండా ఆయన కోలుకునే వరకు అన్ని విధాలా అండగా ఉంటానని మాట ఇచ్చారు. స్టార్ హీరోగా ఉన్నా? తనతో పని చేసే చిన్న ఉద్యోగులను, స్టంట్ మ్యాన్‌లను , డూప్‌లను సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారనే పేరుంది. ఈ సంక్షోభ సమయంలో పర్వేజ్ కాజీకి సల్మాన్ అందించిన భరోసా చూసి బాలీవుడ్ .. అభిమానులు ఆయన్ని ప్రశంసిస్తున్నారు.
ఆపదలో ఉన్నవారికి సల్మాన్ ఎప్పుడూ ముందుంటారనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం. ప్రస్తుతం పర్వేజ్ కాజీ శస్త్రచికిత్స విజయవంతమై కోలుకుంటున్నట్లు సమాచారం. తన ఆరోగ్య పరిస్థితి గురించి సల్మాన్ ఖాన్ తనకు అందించిన అండదండల గురించి తెలుపుతూ ఆయన సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోకు - డూప్‌కు మధ్య ఉండే అనుబంధం ఎంతోమందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది.
వెండితెరపై విలన్లను ఎదిరించే హీరో రియల్ లైఫ్‌లో తనపై ఆధారపడిన వారి కష్టాలను తీర్చే మనిషిగా మారడం ఎంతో మంది ప్రేక్షకుల హత్తుకుంటోంది. సల్మాన్ ఖాన్ సేవా గుణం .. సహాయాలు తరచూ బయటికి వస్తూనే ఉంటాయి. కానీ ప్రచారం మాత్రం సల్మాన్ కోరుకోరు. ఎన్ని సహాయాలు చేసినా? వీలైనంత వరకూ వాటి గురించి ఎక్కడా ఓపెన్ అవ్వరు. మీడియా అడిగినా? నవ్వి వెళ్లిపోతారు. చేసే సహాయం చెప్పుకుంటే? ఒక చేత్తో చేసి మరో చేత్తో ఏదో తీసుకున్నట్లు అనిపిస్తుందని సల్మాన్ భావిస్తారు. అందుకే ఎంత పెద్ద సహాయం చేసినా? చెప్పుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడని నటుడాయన. ఇక సల్మాన్ సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా నటించిన `మాతృభూమి` రిలీజ్ కావాల్సి ఉంది. అలాగే వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ఓ సినిమాను ఇటీవలే పట్టాలె క్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
