Begin typing your search above and press return to search.

సూప‌ర్‌స్టార్ ముందున్న స‌వాల్.. నోలాన్ హిస్టారిక‌ల్ డ్రామాను కొట్టేయాలి!

బాలీవుడ్ కండ‌ల హీరో, సూపర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ మునుముందు ఒక భారీ పీరియ‌డ్ హిస్టారిక‌ల్ మూవీలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   18 Jun 2026 11:00 PM IST
సూప‌ర్‌స్టార్ ముందున్న స‌వాల్.. నోలాన్ హిస్టారిక‌ల్ డ్రామాను కొట్టేయాలి!
X

బాలీవుడ్ కండ‌ల హీరో, సూపర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ మునుముందు ఒక భారీ పీరియ‌డ్ హిస్టారిక‌ల్ మూవీలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా క‌థ‌నాలొస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో అత‌డు వీర‌త్వం ఉన్న ఒక రారాజుగా క‌నిపిస్తాడా? లేదా అనేది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక సరికొత్త కథతో, ఈ పీరియడ్ డ్రామాను ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాలని ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అక్తర్‌కు చెందిన `ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్` నిర్ణయించినట్లు బాలీవుడ్‌లో గట్టి గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ పీరియడ్ ప్రాజెక్ట్ అనుకున్నంత సులువు కాదు.. ఇది స‌ల్మాన్ - ఫ‌ర్హాన్ జోడీ ముందున్న అతి పెద్ద స‌వాల్‌గా మారనుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు హాలీవుడ్ నుండి వచ్చిన ఎన్నో అధునాతన పీరియ‌డ్ యాక్ష‌న్ డ్రామాల్ని వీక్షించి చాలా అప్‌డేటెడ్‌గా ఉన్నారు. హాలీవుడ్ క్లాసిక్స్ అయిన గ్లాడియేట‌ర్, 300, ట్రాయ్ లాంటి చిత్రాలలోని భారీత‌నాన్ని, అద్భుత‌మైన వీఎఫ్ ఎక్స్ (VFX) టెక్నిక్‌ను మించి ఈ సినిమాలో చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బాలీవుడ్ సొంత ప‌రిశ్ర‌మ నుంచే `చావా` లాంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ హిస్టారికల్ చిత్రం వచ్చిన నేపథ్యంలో.. దానికి మించిన బలమైన కథను స‌ల్మాన్ - ఫ‌ర్హాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈ భారీ పీరియ‌డ్ యాక్ష‌న్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం కోసం నిర్మాత ఫ‌ర్హాన్ అక్తర్ ఏకంగా 500 కోట్ల‌ నుండి 1000 కోట్ల రూపాయల వరకు భారీ బడ్జెట్‌ను సుమారుగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. పొరుగున ఉన్న సౌత్ పరిశ్రమలలో ఈమాత్రం భారీ బడ్జెట్లు పెట్ట‌డానికి నిర్మాతలు వెన‌కాడ‌ని ఈ క్ర‌మంలో ఫ‌ర్హాన్ కి ఇది నిజంగా పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో సౌత్ లో భారీ సినిమాలు తెర‌కెక్కి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అసాధార‌ణ వ‌సూళ్లు సాధిస్తున్న నేప‌థ్యంలో ఈ నార్త్ జోడీ ట్రేడ్ పరంగా తీవ్రమైన పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఇండియన్ స్క్రీన్‌పై రాజ‌మౌళి-మహేష్ బాబు కాంబినేషన్ చిత్రం, నితీష్ తివారీ ప్రతిష్టాత్మక చిత్రం `రామాయ‌ణం`, నాగ్ అశ్విన్ వండర్ `క‌ల్కి 2898 ఏడి` సీక్వెల్ లాంటి అత్యంత భారీ బ‌డ్జెట్ల‌తో రూపొందుతున్న దృశ్యకావ్యాలు రాబోతున్నాయి. ఇదే కాదు.. క్రిస్టోఫ‌ర్ నోలాన్ మొద‌టిసారి ఒక పీరియాడిక‌ల్ యాక్ష‌న్ సినిమా` స్పేస్ ఒడిస్సీ`ని భార‌తీయ ప్రేక్ష‌కుల‌కు చూపించ‌బోతున్నాడు. అందువ‌ల్ల అంత‌కుమించి రాజ‌మౌళి నెక్ట్స్ మూవీ కోసం ఆలోచ‌న‌లు సాగుతాయి. కాబట్టి వీట‌న్నిటినీ డామినేట్ చేసే రేంజులో, సాంకేతికంగా హై క్వాలిటీ విజువల్స్ అందించడం కోసం భారీ బ‌డ్జెట్లు, సుదీర్ఘ స‌మ‌యాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. సాంకేతికత - బడ్జెట్ పరంగా స‌ల్మాన్ - ఫ‌ర్హాన్ మునుపెన్నడూ లేనంత బిగ్ ఛాలెంజ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరోవైపు ఇటీవ‌లి కాలంలో స‌ల్మాన్ ఖాన్ ఎంపిక చేసుకుంటున్న పాత్ర‌ల వివరాలు చూస్తే.. ఆయన వరుస ప్రయోగాలకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. ఓవైపు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిప‌ల్లి చిత్రంలో సల్మాన్ `గుండు బాస్` (ముట్టై బాస్)గా క‌నిపించ‌నుండటం అభిమానుల‌కు పెద్ద షాకింగ్ ఎలిమెంట్‌గా మారింది. తన రెగ్యుల‌ర్ డీసెంట్ లుక్ కంటే ఎంతో భిన్న‌మైన, రగ్గడ్ లుక్ లో ఖాన్‌ను ఆవిష్క‌రించే సాహ‌సం వంశీ పైడిప‌ల్లి చేస్తున్నారు. దీనికంటే ముందే స‌ల్మాన్ చైనాతో బార్డ‌ర్ వార్ నేప‌థ్యంలో సాగే `మాతృభూమి` అనే చిత్రంలో వీర సైనికుడిగా, ప్రేమికుడిగా క‌నిపించ‌నున్నాడు. ఆ తర్వాత రాజ్ అండ్ డీకే కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న‌ భారీ చిత్రంలో సల్మాన్ మొదటిసారి ఒక `సూప‌ర్ హీరో` పాత్ర‌లో కూడా అలరించనున్నాడు. గుండు బాస్ నుండి సూపర్ హీరో వరకు సల్మాన్ చేస్తున్న ఈ ప్రయోగాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.