Begin typing your search above and press return to search.

బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ .. రికార్డులు కొట్టేలా `మాతృభూమి` వైబ్స్

స‌ల్మాన్ భాయ్ `సికంద‌ర్` బ్యాడ్ రిజ‌ల్ట్ ని ఇప్ప‌టికీ డైజెస్ట్ చేసుకోలేక‌పోతున్నాడు. దానికి ముందు `టైగ‌ర్-3` రిజ‌ల్ట్ కూడా సోసోనే. అందుకే ప‌రాజ‌యాల‌ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే క‌చ్ఛితంగా ఏదో ఒక‌టి చేయాలని డిసైడ్ అయ్యాడు.

By:  Sivaji Kontham   |   24 Jan 2026 8:06 PM IST
బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ .. రికార్డులు కొట్టేలా `మాతృభూమి` వైబ్స్
X

స‌ల్మాన్ భాయ్ `సికంద‌ర్` బ్యాడ్ రిజ‌ల్ట్ ని ఇప్ప‌టికీ డైజెస్ట్ చేసుకోలేక‌పోతున్నాడు. దానికి ముందు `టైగ‌ర్-3` రిజ‌ల్ట్ కూడా సోసోనే. అందుకే ప‌రాజ‌యాల‌ నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే క‌చ్ఛితంగా ఏదో ఒక‌టి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు దేశ‌భ‌క్తి సినిమాల హ‌వా సాగుతున్న క్ర‌మంలో అత‌డు తెలివిగా ఇండో-చైనా బార్డ‌ర్ వార్ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ను ఎంపిక చేసుకున్నాడు.

గ‌ల్వాన్ లోయ‌లో ఇండియా వ‌ర్సెస్ చైనా సైనికుల బాహాబాహీని తెర‌పైకి తెస్తున్నాడు. ఆయుధాలు లేకుండా భుజ‌బ‌లం బుద్ధిబ‌లం ఉప‌యోగించి భార‌తీయ సైనికులు మంచు కొండ‌ల్లో మైన‌స్ డిగ్రీల చ‌లిలో ఎలా పోరాడారో తెర‌పై చూపించ‌బోతున్నాడు. ఇందులో సైన్యాన్ని న‌డిపించే కెప్టెన్ గా అత‌డు విరోచిత పోరాటాల‌తో ర‌క్తి క‌ట్టించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

అందుకే #బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ కోసం భాయ్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ఈ సినిమా కోసం త‌న రూపాన్ని ది బెస్ట్ గా మార్చాడు. ఇప్పుడు త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ ని కూడా ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ముందుకు తీసుకెళుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి `మాతృభూమి` తాజాగా వెబ్ లో విడుద‌లై వైరల్ గా దూసుకెళుతోంది. ఇది కేవలం ఒక పాట మాత్రమే కాదు.. అది ప్రతి భారతీయుడి గుండెల్లో మండుతున్న దేశభక్తి జ్వాల. ఈ పాట వింటుంటే వచ్చే ఉద్విగ్న‌త, ఆ అనుభూతే వేరు.

ఈ దేశ‌భ‌క్తి గీతం నిజంగా హార్ట్ ట‌చింగ్. చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ తనలోని అసలైన నటుడిని బయటకు తీశారు. గల్వాన్ లోయలో మన సైనికుల వీరత్వాన్ని గౌరవిస్తూ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ నేలతల్లికి ఇచ్చే నిజమైన నివాళి. ఆ కళ్లలో కనిపించే తీవ్రత, దేశం పట్ల ఉండే గౌరవం ఈ సినిమాను కేవలం కమర్షియల్ హిట్ గానే కాకుండా.. ఒక ఎమోషనల్ సక్సెస్ గా మార్చబోతోంది. ఈ దృశ్యం థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో నుంచి లేచి నిలబడేలా చేస్తుంది. 2020లో గల్వాన్ లోయలో మన సైనికులు చూపిన తెగువను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఈ సినిమా పాట కీలక పాత్ర పోషిస్తోందని అర్థ‌మ‌వుతోంది. 2020 జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత- చైనా సైనికుల మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

ఈ సినిమాలో సరిహద్దుల్లో మంచు కురిసే గడ్డకట్టే చలిలో, దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల కథను సల్మాన్ అంతే వేడితో చూపిస్తున్నారు. నిజానికి స‌ల్మాన్ స్టార్ ప‌వ‌ర్ దృష్ట్యా, ఎంపిక చేసుకున్న దేశ‌భ‌క్తి కాన్సెప్ట్ దృష్ట్యా బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ క‌చ్ఛితంగా దురంధ‌ర్ ని బీట్ చేయాలి. క‌లెక్ష‌న్ల‌లో సంచ‌ల‌నం సృష్టించాలి. మాతృభూమి పాట అలాంటి వైబ్స్ ని ఇస్తోంద‌ని స‌ల్మాన్ అభిమానులు న‌మ్ముతున్నారు. మన నేషనల్ ఆంథమ్ స్థాయి ఎమోషన్‌ను ఇస్తోంది. ఈ చిత్రం 2026 జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా, రిపబ్లిక్ డే వీకెండ్ లక్ష్యంగా విడుదల చేయాల‌ని ప్లాన్ చేసినా కానీ కుద‌ర‌లేదు. దీనిని వేస‌విలో ఏప్రిల్ 17న విడుద‌ల చేయ‌నున్నారు.