ఏదో ఒక రోజు పిల్లల్ని కంటాడట.. 60 వయసులో ఇదేమి ఆశ?
ఎపిసోడ్ 1లో కథానాయికలతో సల్మాన్ ఖాన్ ఎఫైర్ల గురించి ప్రశ్నించగా, అతడి నుంచి వచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.
By: Sivaji Kontham | 25 Sept 2025 11:59 AM ISTబుల్లితెర టాక్ షోలు చాలా వరకూ సెలబ్రిటీల మనసుల్లో ఏం దాగి ఉందో బయటకు రాబడుతున్నాయి. ఆ సమయంలో ఫ్లోలో ఎవరికీ తెలియని విషయాలను కూడా బయటకు చెప్పించడం కొందరు యాంకర్ల ప్రత్యేకత. కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ వ్యక్తిగ- బెడ్ రూమ్ విషయాలను కూడా బయటపెట్టడంలో సుప్రసిద్ధుడు. స్టార్ల ప్రేమకథలను పబ్లిగ్గా అందరికీ లీక్ చేయడం కూడా ఈ షోలో ఒక ట్రెండ్. ఇప్పుడు టూమచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ షో కూడా ఇలాంటిదే.
అయితే ఇక్కడ ఇద్దరు మహిళా హోస్ట్‌లు, తమ ఎదుట ఉన్న సెలబ్రిటీలను పెనంలో రోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అమీర్ ఖాన్- సల్మాన్ ఖాన్ లతో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. ఎపిసోడ్ 1లో కథానాయికలతో సల్మాన్ ఖాన్ ఎఫైర్ల గురించి ప్రశ్నించగా, అతడి నుంచి వచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.
అతడు గతంలో కథానాయికలతో డేటింగ్ చేసినా, చివరివరకూ సరైన సంబంధాలను కొనసాగించలేకపోవడానికి తన తప్పులే కారణమని ఒప్పుకున్నాడు. ఈ విషయంలో తనను తాను నిందించుకుంటానని కూడా చెప్పాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా అతడు.. తనకు పిల్లల్ని కనాలని ఉన్నట్టు చెప్పాడు. ''నేను ఏదో ఒక రోజు పిల్లల్ని కంటాను.. చివరికి ఒకరికి పిల్లలు పుడతారు.. కానీ చూద్దాం!'' అని వ్యాఖ్యానించాడు.
భాగస్వాముల్లో ఒకరు ఇంకొకరి కంటే బాగా ఎదిగితే తేడాలు రావడం ప్రారంభమవుతాయని సల్మాన్ అనుభవ పూర్వకంగా మాట్లాడాడు. ఒకరిని మించి ఒకరు ఎదిగినప్పుడే అభద్రత ఏర్పడుతుంది.. కాబట్టి వారిద్దరూ కలిసి ఎదగాలి.. ఇద్దరూ ఒకరి నుండి ఒకరు బయటపడాలి.. నేను దానిని నమ్ముతాను.. అని అన్నాడు.
`టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్` షో సెప్టెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. స్క్రిప్ట్ లేని ఈ సిరీస్ బాలీవుడ్‌లోని పాపులర్ స్టార్‌లను ఒక వేదికపై కలుపుతోంది. సల్మాన్- అమీర్ మొదటి ఎపిసోడ్‌లో కలిసి కనిపించారు. గోవిందా-చంకీ పాండే, జాన్వీ-కరణ్ జోహార్, ఆలియా- వరుణ్ ధావన్ ఇలా జోడీగా కలిసి కనిపించనున్నారు.
