చాప్లిన్ .. హిట్లర్ .. అంటూ స్టార్ హీరోని గేలికేస్తున్నారు
భజరంగి భాయిజాన్, దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న సల్మాన్ ఖాన్ ఆ తర్వాత సరైన ఒక్క హిట్టు కూడా అందుకోలేదు.
By: Sivaji Kontham | 5 Sept 2025 12:52 PM ISTభజరంగి భాయిజాన్, దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్న సల్మాన్ ఖాన్ ఆ తర్వాత సరైన ఒక్క హిట్టు కూడా అందుకోలేదు. ఇది అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టైగర్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన చివరి చిత్రం `టైగర్ 3` ఆశించిన విజయాన్ని అందుకోకపోవడం పెద్ద నిరాశ. అందుకే ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్ ఏ ప్రయత్నం చేస్తున్నా, అభిమానులు నిశితంగా గమనిస్తున్నారు.
సల్మాన్ ఎంపికల్ని విమర్శించేందుకు కూడా వెనకాడటం లేదు. ప్రస్తుతానికి సల్మాన్ ముందున్న ఏకైక లక్ష్యం.. తన కెరీర్ ని తిరిగి గాడిలో పెట్టే ఏకైక బ్లాక్ బస్టర్ అందుకోవడం. తద్వారా అభిమానులను ఫుల్ ఖుషీ చేయడం. కానీ అది అంత తేలిగ్గా జరిగేట్టు లేదు. ప్రస్తుతం చైనా బార్డర్ లో గల్వాన్ లోయ సైనిక చర్య నేపథ్యంలో రూపొందుతున్న `ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్`పై సల్మాన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా రకరకాల కారణాలతో వాయిదా పడిందని కథనాలొచ్చాయి.
ఇంతలోనే సల్మాన్ ఖాన్ తన `బిగ్ బాస్` కొత్త సీజన్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించడం, షో కోసం షూట్ లో పాల్గొన్నప్పటి ఫోటోలు లీక్ కావడం తెలిసిందే. బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఇటీవల రక్తి కట్టిస్తున్నాయి. ఈ షో సమయంలో సల్మాన్ పబ్లిక్ అప్పియరెన్స్ గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా సల్మాన్ రూపం పూర్తిగా మారిపోయింది. అతడు బాగా ఉబ్బిపోయి కనిపిస్తున్నాడు. పొట్ట కూడా కనిపిస్తోంది. కండల హీరోగా తీరైన రూపంతో ఒకప్పుడు భాయ్ అని పిలిపించుకున్న అతడు ఇప్పుడు షేపవుట్ అయ్యి కనిపిస్తున్నాడు. ఇది అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది.
తాజాగా సల్మాన్ ఖాన్ గళ్ల చొక్కా తొడుక్కుని పబ్లిక్ వేడుకకు విచ్చేసినప్పటి ఓ ఫోటో ఇంటర్నెట్ లో మీమ్ ఫెస్ట్ కి దారి తీసింది. ఈ కొత్త లుక్ నిజంగానే విస్మయపరుస్తోంది. సల్మాన్ కళ్లు ఉబ్బి కనిపిస్తున్నాయి. అంతగా నిదురపోవడం లేదనే సంకేతాల్ని కూడా అందిస్తున్నాయి. అలాగే అతడి మీసకట్టు సహా దేనిపైనా శ్రద్ధ కనబరచడం లేదు. మీసకట్టు చూశాక చార్లీ చాప్లిన్, హిట్లర్ అంటూ రకరకాల కామెంట్లు చేస్తూ, నెటిజనులు మీమ్స్ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు అతడు తన వయసుకు తగ్గ సినిమాలు చేయడం లేదని కూడా ఒక సెక్షన్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
సల్మాన్ ఒకప్పుడు గొప్ప మాస్ యాక్షన్ సినిమాలు చేసారు. కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి అంతగా విషయం లేని కథలకు ఓకే చెబుతున్నాడని కూడా విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు గల్వాన్ లోయ వార్ నేపథ్య కథతో అన్నిటికీ సమాధానం చెబుతాడని కూడా ఒక సెక్షన్ అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి సల్మాన్ పొట్టి మీసం చాలా ఉల్లాసకరమైన చర్చకు దారి తీసింది. అతడు చాప్లిన్ లా, హిట్లర్ లా కనిపిస్తున్నాడంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా ప్రస్తుతం సల్మాన్ దృష్టి తదుపరి ప్రాజెక్ట్ పైనే. `భాయ్ పునరాగమనం`లో గట్టిగా కొడతాడనే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
