వంశీ పైడిపల్లి- దిల్ రాజు క్రేజీ మూవీకి 110 కోట్ల డీల్?
బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ `మాన్‌స్టర్` విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 25 Sept 2026 7:00 AM ISTబాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ `మాన్‌స్టర్` విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో నేషనల్ అవార్డు గ్రహీత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ గురించి హిందీ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. బాలీవుడ్‌లో అట్లీ, మురుగదాస్ వంటి సౌత్ డైరెక్టర్ల బాటలో వంశీ పైడిపల్లి కూడా తన మొదటి హిందీ చిత్రంతోనే సంచలన విజయం సాధించాలనే కసితో ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో దీనిపై అంతకంతకు హైప్ పెరుగుతోంది.
ఈ చిత్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన హైలైట్ ఏంటంటే.. దేశంలోని ప్రముఖ ఎగ్జిబిషన్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ సంస్థ ఈ సినిమా ఆల్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఏకంగా రూ. 110 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇది రిఫెండబుల్ అడ్వాన్స్ స్ట్రక్చర్‌పై కుదిరిన భారీ ఒప్పందమని.. సల్మాన్ ఖాన్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్‌పైనా అలాగే సినిమా విజువల్స్ పైనా ఉన్న అపారమైన నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్లు ఈ మొత్తాన్ని వెచ్చించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార తొలిసారిగా జతకడుతుండగా.. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సల్మాన్ ఖాన్ ఇందులో ఇప్పటివరకు చూడని పూర్తిగా భిన్నమైన, విభిన్నమైన యాక్షన్ లుక్స్‌లో అలరించబోతున్నారు. మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకునేలా పక్కా కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ వంద కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్‌తో `మాన్‌స్టర్` బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు నాంది పలుకుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ నటించిన గత చిత్రం `సికిందర్` థియేటర్లలోకి రాకముందే నాన్-థియేట్రికల్ ప్రీ-రిలీజ్ రెవెన్యూ రూపంలో ఏకంగా రూ. 165 కోట్ల భారీ మొత్తాన్ని సాధించింది. ఈ నాన్-థియేట్రికల్ డీల్ ద్వారా సినిమా నిర్మాణ వ్యయంలో సుమారు 80-85 శాతం వరకు రికవరీ అయింది. ఇప్పుడు `మాన్‌స్టర్` విషయంలోను పెద్ద డీల్ కుదిరింది. తదుపరి డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా భారీ మొత్తాలను రాబట్టుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ డెబ్యూ కోసం సర్వశక్తులు:
బాలీవుడ్ డెబ్యూ మూవీగా తెరకెక్కుతున్న `మాన్‌స్టర్` టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కెరీర్‌కు అత్యంత కీలకం కాబోతోంది. నేషనల్ అవార్డు గ్రహీతగా తెలుగులో ఇప్పటికే ఘన విజయాలు సాధించిన అతడు సల్మాన్ ఖాన్ పై చాలా హోప్స్ తో ఉన్నాడు. కేవలం డెబ్యూ మూవీ మాత్రమే కాకుండా.. ఏకంగా రూ. 100 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ - పీవీఆర్ ఐనాక్స్ వంటి దిగ్గజ సంస్థ డిస్ట్రిబ్యూషన్ దక్కించుకోవడం ఈ సినిమా స్థాయిని తెలియజేస్తోంది. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని సరికొత్త, విభిన్నమైన లుక్స్ .. మాస్ ట్రీట్‌తో రానున్న ఈ చిత్రం.. వంశీ పైడిపల్లిని జాతీయ స్థాయిలో ప్రముఖ దర్శకుల జాబితాలో నిలపడంలో కీలకపాత్ర పోషించనుంది.
కథాంశం:
ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పూర్తిగా భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషన్ -కమర్షియల్ హంగులతో కూడిన ఈ కథలో ... సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగినట్లుగా.. ఒక సరికొత్త ట్రీట్‌మెంట్‌తో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
