Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకి కేంద్రం గ్రీన్ సిగ్నెల్!

అతి త్వ‌ర‌లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెన్సార్ క్లియరెన్స్ అనంతరం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

By:  Srikanth Kontham   |   3 Oct 2026 6:18 PM IST
స్టార్ హీరోకి కేంద్రం గ్రీన్ సిగ్నెల్!
X

సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `మాతృభూమి' విడుదలకు ఎదురైన కీలక అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సినిమా కొత్త వెర్షన్‌ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రాజెక్ట్‌‌కు అభ్యంతరం లేదని పత్రం (NOC) మంజూరు చేసినట్లు సమాచారం. కొన్ని నెల‌లుగా రకరకాల వివాదాలు, రీషూట్‌లు, విడుదల తేదీల మార్పుల వల్ల ఆగిపోయిన చిత్రానికి ప్రభుత్వ ఆమోదం లభించడంతో సల్మాన్ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ చిత్ర కథ తొలుత 2020లో గల్వాన్ లోయలో భారత, చైనా సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణల ఆధారంగా రూపుదిద్దుకుంది. ప్రారంభంలో `బ్యాటిల్ ఆఫ్ గల్వాన్` టైటిల్ తో తెరకెక్కిన చిత్రంలో చైనా వ్యతిరేక భావనలున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమా అసలు విడుదలవుతుందా? రద్దయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే చిత్ర యూనిట్ ప్రాజెక్ట్‌‌ను పక్కన పెట్టకుండా స్క్రిప్ట్‌లో ... చిత్రీకరణలో గణనీయమైన మార్పులు చేయడానికి ముందుకు వచ్చింది.

ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని మేకర్స్ చిత్రంలో పలు సన్నివేశాలను రీషూట్ చేశారు. గతంలో ఉన్న వివాదాస్పద అంశాలను తొలగించడమే కాకుండా నూతన వెర్షన్‌లో భారత్ - చైనాల మధ్య ఉన్న సంబంధాలను సానుకూల దృక్పథంలో చూపించేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సవరించిన కథనాన్ని పరిశీలించిన పిమ్మట ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ సంతృప్తి చెంది గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.

ప్రస్తుతం సెన్సార్ బోర్డు అనుమతి కోసం సిద్ధమవుతోంది. సెన్సార్ ప్రక్రియ ఈ నెలలోనే పూర్తయితే, వచ్చే నెల నవంబర్ 13న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని సల్మాన్ ఖాన్ భావిస్తున్నారు. దీపావళి పండుగ తర్వాతి సమయం కావడం వల్ల ప్రేక్షకులు ఇంకా పండుగ మూడ్‌లోనే ఉంటారని.. అది సినిమా వసూళ్లకు తోడ్పడుతుందని చిత్రబృందం అంచనా వేస్తోంది. ఒకవేళ ఇదే తేదీ ఖరారైతే నితేష్ తివారీ భారీ చిత్రం `రామాయణ పార్ట్ 1` విడుదలైన వారం రోజులకే మాతృభూమి కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సల్మా ఖాన్ నిర్మిస్తున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్‌తో పాటు చిత్రంగద సింగ్ ముఖ్యమైన పాత్రలో నటించారు. `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` అనే పూర్తి టైటిల్ తో రానున్న ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అవ్వాలి. కథలో మార్పులు, టైటిల్ స్వల్ప మార్పుల అనంతరం ఎట్టకేలకు సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.

అనేక ప్రతిబంధకాలను అధిగమించి విడుదల దిశగా అడుగులు వేస్తున్న `మాతృభూమి` చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో - ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మేకర్స్ ఇంకా అధికారికంగా విడుదల తేదీని ప్ర‌క‌టించిక‌పోయినా?

అతి త్వ‌ర‌లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెన్సార్ క్లియరెన్స్ అనంతరం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.