Begin typing your search above and press return to search.

యాంకర్ ఓవర్ యాక్షన్‌కు చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్

ఈ అవార్డు వేడుకలో హోస్ట్ మాట్లాడుతూ రాజ్‌పాల్ యాదవ్ గతంలో ఎదుర్కొన్న చెక్ బౌన్స్ కేసును ప్రస్తావిస్తూ సెటైరికల్ వ్యాఖ్య చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 April 2026 12:00 AM IST
యాంకర్ ఓవర్ యాక్షన్‌కు చెక్ పెట్టిన సల్మాన్ ఖాన్
X

బాలీవుడ్‌లో తాజాగా జరిగిన ఒక అవార్డు వేడుక చుట్టూ వివాదం చెలరేగింది. స్క్రీన్ అవార్డ్స్ 2026 సందర్భంగా ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాద‌వ్‌పై యాంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ పరిణామంలో స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.

రాజ్‌పాల్ పై యాంక‌ర్ సెటైరిక‌ల్ కామెంట్స్

ఈ అవార్డు వేడుకలో హోస్ట్ మాట్లాడుతూ రాజ్‌పాల్ యాదవ్ గతంలో ఎదుర్కొన్న చెక్ బౌన్స్ కేసును ప్రస్తావిస్తూ సెటైరికల్ వ్యాఖ్య చేశారు. డాలర్ రేటు పెరిగినా, తగ్గినా మీరు తీసుకున్న అప్పు మాత్రం అదే మొత్తంలో తిరిగి చెల్లించాలనే కామెంట్ ప్రేక్ష‌కుల‌ ముందే రావడంతో రాజ్‌పాల్ కొంత అసౌకర్యంగా కనిపించారు. ఈ కామెంట్స్ ఎంట‌ర్టైన్మెంట్ కోసం చేసినవైనా, ప‌ర్స‌న‌ల్ విష‌యాన్ని స్టేజ్ మీద ప్రస్తావించడం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

రాజ్‌పాల్ కు మ‌ద్ద‌తుగా స‌ల్మాన్ పోస్ట్

కాగా ఈ వివాదం చెలరేగిన వెంటనే స‌ల్మాన్ ఖాన్ రియాక్ట్ అవ‌డం విశేషం. తన సోషల్ మీడియా వేదికగా ఆయన రాజ్‌పాల్ యాదవ్‌కు మద్దతు తెలుపుతూ ఒక ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. మీరు మూడు దశాబ్దాలుగా ఈ పరిశ్రమలో నిలబడటం మీ ప్రతిభకు నిదర్శనం. మీ పని మీద మాకు నమ్మకం ఉంది. అందుకే మిమ్మల్ని మళ్లీ మళ్లీ సినిమాల్లోకి తీసుకుంటున్నామంటూ ఆయన్ని ప్రశంసించారు. స‌ల్మాన్ చేసిన పోస్ట్ లోని ఈ వ్యాఖ్యలు రాజ్‌పాల్‌కు పెద్ద మానసిక బలం ఇచ్చాయని చెప్పాలి.

ప్ర‌శంస‌లందుకుంటున్న స‌ల్మాన్

అదే సమయంలో డాలర్ రేటు గురించి వచ్చిన వ్యాఖ్యలపై కూడా సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. డాలర్ పెరిగినా, తగ్గినా మనకు పెద్దగా సంబంధం లేదు. మనం పని చేసేది, తీసుకునేది అన్నీ ఇండియన్ కరెన్సీలోనే కదా అంటూ హాస్యాన్ని జోడిస్తూ పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఒక సీనియర్ నటుడి గౌరవాన్ని కాపాడే విధంగా ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రశంసలు అందుకుంటోంది.

ఇక ఈ ఘటనపై ప్రేక్షకుల రియాక్ష‌న్ కూడా గట్టిగానే వచ్చింది. సోషల్ మీడియాలో చాలా మంది యాంకర్ కామెంట్స్ ను విమర్శిస్తూ, సీనియర్ నటుల పట్ల గౌరవం అవసరమని పేర్కొన్నారు. ఒకరి వ్యక్తిగత సమస్యలను వినోదంగా మార్చడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, రాజ్‌పాల్ యాద‌వ్ మాత్రం ఎంతో మెచ్యూరిటీతో స్పందించారు. సల్మాన్ ఖాన్ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ఫ్యాన్స్ ను యాంకర్‌పై విమర్శలు చేయవద్దని కోరారు. ఇలాంటి విషయాలు జరుగుతుంటాయ‌ని, వాటిని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదనే సందేశాన్నిచ్చారు. దీంతో ఆయన వ్యక్తిత్వం మరోసారి వెలుగులోకి వచ్చింది.